Ration ATM Chhattisgarh: సామాన్యులు, నిరుపేదలు రేషన్ సరుకుల కోసం రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే తిప్పలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెక్ పెట్టింది. బ్యాంక్ ఏటీఎం మాదిరిగానే ‘రేషన్ ఏటీఎం’ (Grain ATM / Annapurti Grain ATM) యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ బియ్యం పంపిణీ వ్యవస్థను (PDS) మరింత సులభతరం మరియు సుదర్శనవంతం చేసింది.
Read Also :FSSAI Rules: పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌పై FSSAI ఆంక్షలు
Ration ATM Chhattisgarh: రేషన్ ఏటీఎం (Ration ATM) ప్రత్యేకతలు & ప్రయోజనాలు

బ్యాంక్ ఏటీఎం తరహాలోనే ఈ రేషన్ ఏటీఎం యంత్రాలు వారంలో 7 రోజులు, 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు తమకు వీలైన సమయంలో వెళ్లి బియ్యం తీసుకోవచ్చు. లబ్ధిదారులు తమ ఆధార్ లేదా వేలిముద్ర (Fingerprint) ద్వారా బయోమెట్రిక్ వేసి తక్షణమే తమకు కేటాయించిన బియ్యాన్ని పొందే వీలుంది. డిజిటల్ సెన్సార్ల ఆధారంగా పనిచేయడం వల్ల కిలోకు ఒక్క గ్రామ్ కూడా తగ్గకుండా ఖచ్చితమైన తూకంతో బియ్యం యంత్రం నుంచి బయటకు వస్తాయి. బియ్యం తక్కువగా ఇస్తున్నారనే అవినీతి, మోసాలకు తావుండదు. గంటల తరబడి లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, కేవలం కొన్ని సెకన్లలోనే ప్రయాస లేకుండా రేషన్ బియ్యం డ్రా చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రేషన్ వ్యవస్థలో అనుసంధానించడం ద్వారా పేదలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించవచ్చని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :