Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ECI

Follow Us: Google News Daily Hunt
Elections for 24 Rajya Sabha seats will be held nationwide on June 18.
Elections for 24 Rajya Sabha seats will be held nationwide on June 18.
FONT SIZE
GET APP

Rajya Sabha Elections 2026: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలకమైన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాబోయే జూన్ 18వ తేదీన ఈ రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజున ఓట్ల లెక్పుంపు చేపట్టి ఫలితాలను కూడా అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన వెలువడనుంది.

Read Also :NEET UG 2026 : నీట్ పరీక్షపై ఎన్‌టీఏ క్లారిటీ.. పూర్తి పేపర్ లీక్ కాదట

ఈ దఫా దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలు, గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3 మరియు జార్ఖండ్ రాష్ట్రంలో 2 స్థానాల చొప్పున ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాబలాల ఆధారంగా ఈ స్థానాలను భర్తీ చేయనున్నారు.

Rajya Sabha Elections 2026
Official Notification on June 1st

Rajya Sabha Elections 2026: ఏపీలో ఖాళీ కానున్న నాలుగు కీలక స్థానాలు

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ కోటాకు సంబంధించిన నలుగురు ప్రముఖ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు:

  • అయోధ్య రామిరెడ్డి
  • పిల్లి సుభాష్ చంద్రబోస్
  • సాన సతీష్
  • పరిమళ్ నత్వానీ

వీరి పదవీ కాలం ముగియనుండటంతో, ఏపీలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ 4 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు