Prashant Kishor: బిహార్‌లోని పాట్నా పరిధిలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ (JSP) వ్యవస్థాపకుడు, వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (PK) సంచలన విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీకి (BJP) బలమైన కోటగా పేరుగాంచిన ఈ స్థానంలో భాజపా అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ప్రశాంత్ కిషోర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Read Also:Prashant Kishor: ఉపఎన్నికల్లో సంచలనం..ప్రశాంత్ కిశోర్ లీడింగ్!
ఉపఎన్నిక నేపథ్యం & ముఖ్యాంశాలు

గతంలో ఇక్కడి నుంచి వరుసగా గెలుపొందిన భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ప్రశాంత్ కిషోర్ నేరుగా ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. కుల, మత రాజకీయా తీరుతెన్నులను మార్చాలనే సందేశంతో భాజపాకు అత్యంత బలమైన స్థానాన్ని ఎంచుకుని మరీ పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో జన్ సురాజ్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్, భాజపాకు చెందిన నీరజ్ సిన్హా, అలాగే ఆర్‌జేడీ (RJD) తరఫున రేఖా గుప్తా పోటీపడ్డారు.
Prashant Kishor: రాజకీయ ప్రాముఖ్యత
దశాబ్దాలుగా భాజపా ఆధిపత్యం చెలాయిస్తున్న బంకీపూర్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ప్రశాంత్ కిషోర్ బిహార్ రాష్ట్ర రాజకీయంలో సరికొత్త ప్రత్యామ్నాయ శక్త్యంగంగా ‘జన్ సురాజ్’ పార్టీని నిలబెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: