‘No Detention’ : విషయ పరిజ్ఞానం, సమగ్ర అవగాహన ఉన్నవారె వరైనా ముందు చదువులకు అర్హులేనన్న భావనలో ప్రభుత్వాలు విద్యావిధానాన్ని గందరగోళపరుస్తున్నాయి. ‘నో డిటెన్షన్’ విధానం గతంలోనే ఉందనుకున్నా, దాని నుంచి సత్ఫలితాలు లేవనే ఆలోచన మేధావులలో ఎప్పు డో ఏర్పడింది. విద్యావ్యవస్థను ఎప్పటికప్పుడు సంస్క రించాలని ప్రభుత్వాలు తలపోయడం, అమలులో దొల్ల తనం వలన చతికిలపడిపోవడం చూస్తూనే ఉన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మిశ్రమ వ్యవస్థగా ఉన్న విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు చేసినా వాటిలో చిత్తశుద్ధి లోపం బయటపడుతూనే ఉంది. మసిపూసి మారేడు కాయగా మారిన చందాన విద్యాసంస్కరణలు వెక్కిరి స్తున్నాయి. బీహార్ ప్రభుత్వం తమ రాష్ట్ర విద్యారంగ చరిత్ర నుంచి ‘నో ఫెయిల్’ అనే పదాన్నే కనపడ కూడదని శాసిస్తోంది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహిం చడం మూల్యాంకనంలో ఎక్కువో తక్కువో మార్కులు రావడం, వారిని ర్యాంకులతో కీర్తించడం అత్తెసరు మార్కులు సాధించిన వారికి మళ్లీ పరీక్షలు, వాళ్ల ఆత్మ హత్యల కథనాలకు వగచడం ఇవన్నీ వద్దనుకునితాజాగా ‘నో ఫెయిల్’ విధానాన్ని ప్రవేశపెట్టచూస్తోంది. ఇలాంటి విధానాల వలన కనీస విద్యాప్రమాణాలు లేని వారు సైతం అవలీలగా పట్టభద్రులైపోయినా ఆశ్చర్యపడనక్క ర్లేదు. కనీస అభ్యసన ప్రమాణాలు లేవనో అలాంటి విద్యార్థికి అదనపు బోధన, మూల్యాంకన విశ్లేషణలు గుర్తించాలంటే తదుపరి తరగతికి వెళ్లడం కష్టమన్న భావన ప్రతి విద్యార్థికి కలిగినప్పుడే వారిలో విద్యా జిజ్ఞాస పెరుగుతుంది.
Read Also : GATE 2027 Registration: ఐఐటీ మద్రాస్ GATE రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం!

‘No Detention’ : విద్యార్థి ఎందుకూ పనికి రాకుండా పోతాడు
చదివినా చదవకపోయినా చిట్ట చివరికి ఏదో ఒక డిగ్రీ సర్టిఫికెట్ చేతికొస్తుందిలే. అదే ఉద్యోగానికి అర్హత అవుతుంది. ‘చాల్లే ఇది చాల్లే’ అనే ధోరణికి విద్యార్థి అలవాటు పడ్డాడో ఇక విద్యావ్యవస్థ సర్వనాశనమవడం తథ్యం. బీహార్ రాష్ట్రమంటేనేబీమార్ ‘రాష్ట్రంగా పిలువబడుతుంటుంది. అలాంటి రాష్ట్రంలో ఉత్తీర్ణతతో సంబంధం లేని చదువులు అక్కడి విద్యార్థు లకు బతుకు తెరువుకు కష్టమయ్యే పరిస్థితులను తెచ్చి పడతాయి. ఒక తరగతిలో నేర్చుకోదగిన విషయాలు, ప్రమోట్ చేసేస్తే తర్వాతి తరగతిలో చదువుకుంటాడులే అని వదిలేస్తే కొత్త పాఠాలు ఆ విద్యార్థిని బడుద్దాయిని చేస్తాయనడంలో సందేహం లేదు. విద్యావిధానంలో ‘నోఫెయిల్’ భావనను 2009లో అప్పటి కేంద్ర ప్రభు త్వమే తెచ్చింది ఆదీ విద్యాహక్కు చట్టం ద్వారా. విద్య నేర్చుకునేందుకు చట్టం అవసరమవుతుందేమోకానీ ఎలాగైనా పట్టభద్రులైపోవాలనే యోచన మంచిది కాదు. ఆ చట్ట ప్రకారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇక పాఠాలు వినేవారెవరుం టారు. అందునా తమ విలువైన కాలాన్ని ‘వాట్సాప్ రీల్స్’ చూడటానికే గడిపే వారిని తరగతి గదుల్లో బంధించగల పరిస్థితి కానరాదు. తరగతి నుంచి పైతరగ తికి మారినప్పుడల్లా అభ్యసన లోటు పేరుకుపోతే ఆ విద్యార్థి ఎందుకూ పనికి రాకుండా పోతాడు.
భవితను అంధకారంలో ముంచడం
విద్యార్థు లను ఫెయిల్ చేయకపోవడంలో ప్రభుత్వ మూల్యాంక నం ఖర్చులు తగ్గవచ్చు. పరీక్షల్లో లీకుల్లేకుండా నిర్వహిం చలేని ప్రభుత్వాలకు అవే విజయగాధలు కూడాకావచ్చు. కానీ విద్యార్థులు నిరక్షరాస్యులుగా తయారౌతారేమోనన్న సోయి ప్రభుత్వాలకు లేకపోవడం ఆందోళనకరమైన విషయం. ‘నో ఫెయిల్’ అనగానే అదేదో మానవీయతకు మరో రూపమనుకుంటూ జబ్బలు చరుచుకునే విధానం గా భావించలేం. ఆ రకమైన భావనకు పురుడుపోసి విద్యార్థుల భవితను అంధకారంలో ముంచడం ఏమాత్రం సరికాదు. ఉచిత ప్రమోషన్ హక్కు కల్పించాల్సి వస్తే వారి అభ్యసన ప్రమాణాలు, నిరంతర అంతర్గత మూ ల్యాకనం వంటి అంశాల్లో ఎలా వ్యవహరించాలో కూడా అధ్యయనం చేయడం అవసరం. గతంలో ప్రవేశపెట్టిన ‘నో డిటెన్షన్ పాలసీ’లో కూడా ఎక్కడో ఓ తరగతి వద్ద డిటెన్షన్ అయ్యే పరిస్థితి ఉండేది. అలాంటి విద్యార్థులను దొడ్డిదారిన మరో పరీక్ష ద్వారా ప్రమోషన్ చూపించే వ్యవస్థ కూడా ఉండేది. ఇలాంటి విద్యా విధానాల వల్లనే నిరంతరం విద్యార్థి చదువుల మీద శ్రద్ద పెట్టే ప్రైవేట్ విద్యాసంస్థలు అవసరమొచ్చాయి. ఇప్పుడు అలాంటి ఏర్పాట్లున్న విద్యాసంస్థల్లో సంపన్నులు అత్యధిక ఫీజు లు చెల్లించి తమ పిల్లలను చదివిస్తున్నారు.

ఉత్తీర్ణతా శాతం తగ్గుతుందన్న..
2015లోనే ‘నో డిటెన్షన్’ విధానం పట్ల 28 రాష్ట్రాలకు 23 రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పిల్లల్లో నేర్చుకోవడం తగ్గి పోతుందని విశ్లేషించగానే 2019లో విద్యాహక్కు చట్టాన్ని సవరించి 5,8 తరగతుల్లో పరీక్షలు నిర్వహించి సరైన చదువులేకపోతే ‘ఫెయిల్’ విధానాన్ని పునఃస్వాగ తం పలికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తమిళనాడు, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, అసోం, బీహార్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ వంటి 18 రాష్ట్రాలు ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేశాయి. ‘గతంలో ‘నో ఫెయిల్’ విధా నానికి వ్యతి రేకంగా నిర్ణయం తీసుకున్న ‘బీహార్’ ఇప్పు డు మళ్లీ అదే విధానం కోసం పట్టుబడుతోంది. విద్యా ర్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిబిఎస్ఇ విద్యావిధానం లో తమ మార్క్ షీట్లలో ఫెయిల్, కంపార్టుమెంటల్ అనే పదాలకు బదులుగా ‘ఎసెన్షియల్ రిపీట్’ అని సరిపెట్టుకుంది. అంటేమళ్లీ పరీక్షలు రాయా ల్సిందేనన్న మాట. గత 15 ఏళ్లుగా విద్యార్థులఉత్తీర్ణత, ఫెయిల్ అనే విధానంపై ఊగిసలాటలో ఉన్న ప్రభు త్వాలు వారి వారి స్థాయిలో పునరాలోచనలో పడ్డాయి. అది తిరో గమనమా? పురోగమనమా? ఎవరూ నిర్దేశిం చలేదు. కింద తరగతుల్లో ‘ఫెయిల్’ అనే ప్రస్తావన లేకుండా పై తరగతులకు స్వేచ్చగా వదిలిపెడితే పదో తరగతుల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గుతుందన్న విషయం విద్యావేత్తలకు తెలియనిది కాదు.
Read hindi vaartha.com : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: