Modi cabinet reshuffle 2026: మోదీ కేబినెట్ లో కొత్త మంత్రులు వీరేనా!

Follow Us: Google News Daily Hunt
Modi Cabinet Reshuffle
Modi Cabinet Reshuffle
FONT SIZE
GET APP

Modi cabinet reshuffle 2026 : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని, కొన్ని కీలక మంత్రిత్వ శాఖల్లో కొత్త నాయకులకు చోటు కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత బృందంలో కూడా నితిన్ నబిన్ నేతృత్వంలో సమూల మార్పులు చేసేందుకు పార్టీ అగ్ర నాయకత్వం జాబితాను ఖరారు చేసింది. ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి.

Read also: UK roads: 35 డిగ్రీలకే కరుగుతున్న యూకే రోడ్లు

Modi Cabinet Reshuffle

మంత్రిత్వ శాఖల్లో కీలక మార్పులు

ప్రభుత్వ పనితీరును మరింత వేగవంతం చేసేందుకు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించి, ఆ స్థానంలో శక్తికాంత దాస్ ను తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ తిరిగి మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం బలంగా ఉంది. పరీక్షల లీకేజీలు, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ప్రధాని భావిస్తున్నారు. మరోవైపు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా వంటి మంత్రులు పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి వెళ్లగా, జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు స్థానాల్లో కొత్త ముఖాలను కేబినెట్లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Modi cabinet reshuffle 2026 : కొత్త ముఖాలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి మరికొందరు నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. బెంగాల్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో అక్కడి ఎంపీలకు ప్రాధాన్యత దక్కవచ్చు. శివసేన రెబెల్ వర్గం నుంచి ఒకరిద్దరికి, ముఖ్యంగా శ్రీకాంత్ షిండేకు అవకాశం లభించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆప్ రెబెల్ ఎంపీలు రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రానున్న రోజుల్లో జరగనున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఈ మార్పులు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు