Isro Apprentice : ఇస్రో 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి వీటిని నింపనున్నారు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో ఆగస్టు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తమ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవాలి.
Read Also: ILO Praises India: భారత్‌లో కొత్త చరిత్ర: 101 కోట్ల మందికి సామాజిక భద్రత

ఖాళీలు
మూడు విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవి.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 220, టెక్నికల్ అప్రెంటిస్ 120, కమర్షియల్ అప్రెంటిస్ 70 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో అర్హతకు సంబంధించిన విద్యను పూర్తి చేసినవారే దరఖాస్తు చేసుకోవాలి.
Isro Apprentice : దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు ముందుగా NATS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. తరువాత ఉమంగ్ (UMANG) పోర్టల్‌లో యూఆర్‌ఎస్‌సీ అప్రెంటిస్‌షిప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో NATSలో వచ్చిన ఎన్‌రోల్‌మెంట్/అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఎంపికైనవారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 10,900, కమర్షియల్ అప్రెంటిస్‌లకు రూ. 10,900 స్టైపెండ్‌గా ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 28. దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://nats.education.gov.inలో చూడవచ్చు. ఉమంగ్ పోర్టల్ https://web.umang.gov.in/landing/
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :