Caste Census : రాబోయే కులగణన దేశ సమగ్రతకు సవాలు?

Follow Us: Google News Daily Hunt
Caste Census
Caste Census
FONT SIZE
GET APP

Caste Census : భారత దేశంలో సమస్యలు లెక్క పెట్టలేము. ఏళ్ళతరబడి చూరు ను పట్టుకొని వ్రేలాడుతున్నసమస్యలు ఎన్నో రోజుల తరబడి పెరుగుతున్న సమస్యలు ఎన్నెన్నో! అన్నిటిని తల దన్నేలా రోజుకొక సమస్య మన దేశంలో ఉత్పన్నం కాబడుతున్నదా? ఉత్పన్నమవుతున్నవా? అని ఆలో చించటానికి ప్రభుత్వాలకూ, అధికారు లకూ, రాజకీయ నాయకులకూ తీరిక దొరక లేనతంగా సమస్యలు ఎదుర వుతున్న మాట వాస్తవం! ఇవ్వన్నీ అంటే పాత సమస్యలతో పాటు పుట్టుకొస్తున్న కొత్త సమస్యలకు తోడుగా సమస్యలు తక్కువవుతున్నట్టుగా సామాజిక ఉద్యమకారులూ, రాజకీయ వేత్తలూ, ప్రభుత్వాలు కొన్నాళ్ళు జనాభాను లెక్కించాలి ‘సర్’ అంటారు మరికొన్నాళ్ళు ఓటర్ల నిగ్గు తేల్చాలి ‘సర్’ అంటారు! కులాల, మతాల, ప్రాంతాల సమస్యలకు తోడు పరస్పరం పోరాడుకొనేట్లు ‘రాముడేం చేసాడు? చాతగాక అడవుల్లోకి పోయాడు’ అని ఆ రాముని పుట్టు పూర్వోత్త రాలతో సంబంధం లేని వ్యక్తులు మాట్లాడుతే మాట్లాడకు! మా రాముడు దేవుడు కళ్ళు పోతాయి. మా మతాన్ని రాముని పేరు పెట్టి ద్వేషిస్తున్నావా?’ అని మరొకరు మాట్లాడుతూ చినికి చినికి గాలివాన అయిన తీరులో అసహజమైన పోట్లాటలను ప్రోత్సహించటం మొదలు పెట్టారు! ఎంత విషాదకరం? అభివృద్ధి సాధిస్తున్న దేశానికి ‘స్పేడ్ బ్రేకర్స్’ వేసే పనిలో కొందరు ఉండటం ఎంత దురదృష్టకరం!

Read Also : Tribal Areas Health Policy: గిరిజనులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Caste Census
Caste Census

Caste Census : కులగణన ఆచరణ యోగ్యంగా కనపడ లేదు

ఈ నేపథ్యంలో 2027 జులై 6 నుండి సెన్సెసు 2027 సెకండ్ ఫేజ్ రిహార్సల్స్ ప్రారంభం కాబోతున్నది! ఈ ప్రక్రియ ప్రకంపనలు సృష్టిస్తుందా లేకపోతే సాదా సీదాగా గడిచిపోతుందా అని స్వాతంత్య్రం తర్వాత మన దేశ చరిత్ర స్థితి గతులను అధ్యయనం చేస్తున్న విజ్ఞానులు ఎదురు చూస్తున్నారు! ఈ కార్యక్రమం దేశ మంతటా యూనియన్ టెరిటరీతో సహా మొదలు కాబోతున్నది! ఈ రెండవ ‘సర్’ ముఖ్యాంశంగా ఒక ‘ఓపెన్ కాలం’ ఎన్యూమరేషన్లో పాల్గొనే వారు పూరించాలి! నీ కులం ఏమిటి అన్న విష యం నీవు చెబుతే ఆ ‘కాలం’ ద్వారా రికార్డుల్లోకి ఎక్కుతుంది. 2011లో జరిగిన సోషియో ఎకనామిక్, కాస్ట్ సెన్సెస్ (ఎస్.ఇ.సి.సి)కు ఈ కాలం వున్నా, చట్టం ఊతంగా లేదు. ఇప్పుడు జరగబోయే ‘కాస్ట్’ సెన్సెస్ (కుల గణన) చట్ట ప్రకారం జరుగుతున్న ట్లుగా పరిగణించబడుతుంది. 2011 సెన్సెసుకు 2027 సెన్సెస్కు వున్న ముఖ్యమైన తేడాతో కూడిన కీలకాంశం చట్టం! 2027 కులగణన వెనక చట్టం వుంది! జులై 20కి సెన్సెను ప్రక్రియ పూర్తవుతుంది. అటు తర్వాత కులగణన లెక్కలు ప్రభుత్వం తేలుస్తుంది. 2011 కులగణనలో లెక్కకు మించిన కులాలు లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆ కులగణన ఆచరణ యోగ్యంగా కనపడ లేదు! దానికి కారణం 1931 సెన్సెస్లో కేవలం 4,147 కులాల పేర్లు లెక్కల్లో తేలుతే, 2011 ఎస్.ఇ.సి.సి ప్రకా రం 46 లక్షల కులాల పేర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! ఆ లెక్కలు పనికి రాకుండా పోవటానికి కారణం ఇంటి పేర్లు ఉపకులాలు, తెగల పేర్లు గూడా కులాల పేర్ల మీద వచ్చి పడ్డాయి! అందుకనే కేంద్రం సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న ఒక ఉదంతంలో ఈ సెన్సెన్ లెక్కలు తేలేవిగా లేవు, తప్పుల తడకగా మారాయి అని చెప్పక తప్పలేదు! అందుకనే ఈసారి తప్పులు లేని కులగణన చేయగలుగుతేనే ఆ రికార్డుకు హేతుబద్ధత వచ్చి నట్లవుతుంది!

Caste Census
Caste Census

సైంటిఫిక్ కులగణన

2023లో జరిగిన బీహార్ రాష్ట్ర కులాల సర్వే ఒక విధంగా తప్పులు లేని రికార్డును పొందుపర్చ గలిగింది! దానికి కారణం ఎన్యూమరేటర్స్ సహనంతో ఎన్యూమరేట్ చేయబడున్న వ్యక్తిది ఏ కుల మేమిటో క్షుణ్ణంగా తేల్చుకున్న తర్వాతనే లెక్కలోకి తీసుకోవటం వల్ల అది సాధ్యపడిందని కొందరు అభిప్రాయపడ్డారు! జరగ బోయే కులగణనకు పూల్ ప్రూఫ్ మెథడ్స్ అవసరమని అందరూ చెప్తున్నారు కానీ మెథడ్స్ ఏమిటో ఏ పద్ధతులలో కుల నిర్ధారణ చేయాల్నో ప్రభుత్వాలూ, అధికారులూ అర్థం కాని పరిస్థితిలోనే వున్నారు! నిజం మాట్లాడితే స్వాతంత్ర్యం మునుపు అనేక కారణాల వల్ల ఉదాహరణకు సామాజికంగా కులాలు అన్నీ అందరికీ తెలియకపోవటం, కొండల్లో నివ సించే వారికి, ట్రైబ్లకూ కులాల అవగాహన లేకపోవటం తో, తెలిసిన కులాల వారి లెక్కలే చెలామణిలో వుండేవి! నాలుగు వర్ణాల విభజన మంచికో చెడుకో కుల విభజన లెక్కల్లో పెద్ద పీటను అలంకరింప చేసి నోరెత్తనీయని రీతి లో అప్పటి పెత్తందార్లు, పెద్దలూ సమర్ధించటం వల్ల, 1931 సెన్సెస్లో కేవలం 4,149 కులాలు మాత్రమే గుర్తించబడ్డాయి! లిట్రసీ రేటు పెరగటం వల్ల 2011 నాటికి ఆ లెక్క మారి 46 లక్షల్లోకి వాయు వేగంతో చేరుకుంది! సైంటిఫిక్ కులగణన మన దేశంలో ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పుడు జరగబోయే కులగణన (రెండవ ఫేజ్) రాజకీయాల నేపథ్యం లో జరగబోతున్నదన్న అపప్రద గూడా వుంది! ఫార్వర్డ్ కులాలు ఎన్ని? బాక్వర్డ్ కులాలు ఎన్ని ఇతర బాక్వర్డ్ కులాలు ఎన్ని? షెడ్యూలు కాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్ ఏ లెక్కల్లో ఈనాటి సామాజిక రాజకీయ నేపథ్యంలో చూపిం చబడుతాయి? పార్వర్డ్ కులాలకు సంబంధించి ఆర్ధిక నేప థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కలు తేల్చగలు గుతారా? అదే ఆర్థిక అంశం బి.సి ఓబిసి షెడ్యూల్డ్ కులాలు, తెగలకూ వర్తిస్తుంది! క్రీమీ లేయర్, సబ్ కాటగ రైజేషన్ కులాలు రిజర్వేషన్ల వల్ల లాభాలు పొందుతున్నా యని కొందరు లేవనెత్తుతున్నారు! వాటి మాటేమిటి? అందరికీ ఆమోదయోగ్యంగా వుండే విధంగా ప్రారంభిం చబోతున్న కులగణన వుండాలని కోరుకోవటంలో తప్పులేదు కానీ ఈ కులగణన వల్ల దేశం విచ్ఛిన్నం కాకుండా వుంటే చాలు అదే పదివేలు అని ఈ విషయాల పరిజ్ఞానంలో ఆరితేరిన అనుభవజ్ఞులు ఆశించటంలో తప్పులేదేమో!

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు