Cjp protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య గొంతుక నొక్కుతున్నారన్న కేజ్రీవాల్
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వివిధ యువజన సంఘాల పిలుపు మేరకు జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇది అత్యంత హేయమైన చర్య అని, దేశం అధికారికంగా ఒక సంపూర్ణ నియంతృత్వ పాలన వైపు పయనిస్తోందని ఆరోపించారు.
Read also: cgp protest: ఢిల్లీలో నిరసనలు.. రైళ్ల రద్దుపై కేంద్ర మంత్రి చీరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకోవడం దారుణం
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని విమానాశ్రయాల నుంచి నేరుగా అరెస్టు చేయడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని, అలాగే మోదీ కూడా వైదొలగాలని డిమాండ్ చేశారు.

“బ్లాక్ ఎమర్జెన్సీ” విధించారన్న ఆప్ నేతలు
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో బీజేపీ ప్రభుత్వం “బ్లాక్ ఎమర్జెన్సీ”ని అమలు చేస్తోందని ఆరోపించింది. కేవలం ఒక్క వ్యక్తిని రక్షించడం కోసమే మెట్రో స్టేషన్లను మూసివేయడం, రైళ్లను రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆప్ ఎమ్మెల్యే గోపాల్ రాయ్ తీవ్రంగా విమర్శించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com