Ration Card Update: అంత్యోదయ అన్న యోజన (AAY) రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు ప్రకటించింది. నిరుపేద కుటుంబాలకు ఇప్పటి వరకు అందజేస్తున్న రేషన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్రతి వ్యక్తికి 7 కిలోల చొప్పున రేషన్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కుటుంబానికి గరిష్టంగా 35 కిలోల పరిమితిని మాత్రం అలాగే ఉంచింది. ఈ మార్పులు జాతీయ ఆహార భద్రత చట్టం – 2013 పరిధిలో జరగనున్నాయి.
Read also: US-Iran Deal: ఏ కరెన్సీలోనైనా చమురు చెల్లింపులు వుంటాయంటున్న ఇరాన్..భారత్‌కు లబ్ధి!

కొత్త రేషన్ పంపిణీ విధానం వివరాలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబానికి సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందుతున్నాయి. కొత్త విధానంలో కార్డులోని ప్రతి సభ్యుడికి 7 కిలోల చొప్పున లెక్కించనున్నారు. ఉదాహరణకు కుటుంబంలో ఇద్దరు ఉంటే 14 కిలోలు, ముగ్గురు ఉంటే 21 కిలోలు లభిస్తాయి. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు యథావిధిగా నెలకు 35 కిలోల రేషన్ అందుతుంది. ఈ విధానం వల్ల కుటుంబ పరిమాణాన్ని బట్టి రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Ration Card Update: ప్రజాభిప్రాయం సేకరణ అవకాశం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక మార్పుల పట్ల ప్రజల అభిప్రాయాలను కోరుతోంది. ఈ ప్రతిపాదనలపై జులై 13 వరకు సలహాలు, సూచనలను తెలియజేయవచ్చు. ఆహార భద్రత చట్టంలో ఈ సవరణల వల్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు సక్రమంగా అందుతాయని కేంద్రం పేర్కొంది. సాధారణ రేషన్ కార్డుదారులకు ఈ కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం అంత్యోదయ కార్డు ఉన్న అతి పేద కుటుంబాలకు మాత్రమే ఈ మార్పులు పరిమితం కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: