Mamata Banerjee : మమతా బెనర్జీకి మరో షాక్

Follow Us: Google News Daily Hunt
cid searches at mamata banerjee residence
cid searches at mamata banerjee residence
FONT SIZE
GET APP

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రిమా భట్టాచార్య తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా మమతా బెనర్జీకే పంపించారు. పార్టీలో అత్యంత కీలకమైన నేతగా, మమతకు ఎంతో నమ్మకస్తురాలైన సన్నిహితురాలిగా పేరున్న చంద్రిమ ఇలా అకస్మాత్తుగా తప్పుకోవడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Read Also : డాక్టర్ అర్చన గుప్తా మృతి కేసు..బీహార్ బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష!

Inside The Trinamool Mutiny

మునుగుతున్న టీఎంసీ నావ.. ఒంటరవుతున్న దీదీ

ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు మమతకు షాక్ ఇస్తూ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరిపోగా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలే రాజీనామా చేయడం పార్టీని మరింత బలహీనపరిచింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌లో నైరాశ్యం అలుముకున్న తరుణంలో, చంద్రిమా భట్టాచార్య రాజీనామా చేయడం మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస వలసలు, అంతర్గత విభేదాల మధ్య మమతా బెనర్జీ బెంగాల్‌లో తన పట్టును కోల్పోతున్నారనే చర్చ జోరందుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు