Nara Rohiths Engagement on

హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. తదితర కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు.

నారా రోహిత్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షనమైన సినిమాలు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాణం సినిమాతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకుడు. ఆ తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తినాయుడి రెండో కుమారుడు రోహిత్. రోహిత్ కు శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వీరు వివాహానికి దూరంగా ఉన్నారు.

Related Posts
భద్రాద్రి ‘బ్రహ్మోత్సవాల’ తేదీలు ఖరారు చేసిన ఆలయ పెద్దలు
bhadradri ramayya brahmotsa

భద్రాద్రి ఆలయంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తేదీలను శుక్రవారం ఆలయ వైదిక పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్ 31న అధ్యయన ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జనవరి 9న Read more

కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం
కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభనికి ముందు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతాయని, సమావేశాలు సజావుగా సాగేందుకు Read more

పన్ను మినహాయింపు ఎప్పుడు వర్తిస్తుంది అంటే..?
పన్ను మినహాయింపు ఎప్పుడు వర్తిస్తుంది అంటే..?

2025 కేంద్ర బడ్జెట్ చివరికి రానే వచ్చింది! ఇది సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరినీ ఆశపెట్టింది.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025 ఫిబ్రవరి 1న Read more

నేటితో ముగియనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారం
నేటితో ముగియనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5:00 గంటలకు ముగియనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), మరియు కాంగ్రెస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *