మృణాల్ ఠాకూర్ ‘ఎమర్జెన్సీ’ మూవీ రివ్యూ – కంగనా నటన, కథపై ఆమె స్పందన

మృణాల్‌ ఠాకూర్‌ రివ్యూ!

కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ . ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించినట్లు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పోస్ట్‌ పెట్టారు.కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మా నాన్నతో కలిసి ‘ఎమర్జెన్సీ’ చూశాను. ఆ సినిమా అందించిన అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. కంగనా ఫ్యాన్‌గా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆమెకు అద్భుతమైన విజయం. ‘గ్యాంగ్‌స్టర్‌’ నుంచి ‘క్వీన్‌’ వరకు.. ‘తను వెడ్స్‌ మను’ నుంచి ‘మణికర్ణిక’, ‘తలైవి’ వరకు ఇప్పుడు తాజాగా ‘ఎమర్జెన్సీ’ ఇలా నిరంతరం ఆమె నటనలో సరిహద్దులు దాటుతూ అద్భుతమైన ప్రతిభతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి అంశం నన్ను ప్రభావితం చేసింది. కెమెరా యాంగిల్స్‌, కాస్ట్యూమ్స్‌.. ప్రతిదీ నన్ను ఆకర్షించాయి. ఈ చిత్రంతో కంగనా దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారు. స్క్రీన్ ప్లే , మాటలు, సంగీతం, ఎడిటింగ్‌ అన్నీ బాగున్నాయి’’ అని అన్నారు.

seifp58o emergency 625x300 12 February 25

కంగనాతోపాటు నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు,నిజమైన కళాకారిణి. సవాలుతో కూడిన పాత్రలు పోషించడంలో ఆమె చూపించే ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సినిమాపై మీకున్న అంకితభావం ప్రతి ఫేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాను చూడనివారు కచ్చితంగా చూడండి. భారతీయులు అంతా తప్పక చూడాల్సిన చిత్రమిది. సినిమా చూశాక భావోద్వేగంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారని నేను హామీ ఇస్తున్నా’’ అని మృణాల్‌ పేర్కొన్నారు. కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందిరా గాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు.

ఎమర్జెన్సీ’ కథ, ప్రాముఖ్యత

ఈ చిత్రం 1975లో భారతదేశంలో విధించిన అత్యవసర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఆ సమయంలో జరిగిన ప్రధాన రాజకీయ పరిణామాలను దగ్గరగా చూపించనుంది. మృణాల్‌ మాట్లాడుతూ –
“సాధారణంగా చరిత్ర ఆధారిత చిత్రాలు చేయడం చాలా క్లిష్టం. కానీ ‘ఎమర్జెన్సీ’ కథను నిజమైన సంఘటనలను బేస్ చేసుకుని సమర్ధవంతంగా చెప్పారు.” అని చెప్పారు.

కంగనా దర్శకత్వం – మృణాల్ అభిప్రాయం

“ఒక మహిళా దర్శకురాలు ఇంత భారీ సినిమాను తెరకెక్కించడం గర్వించదగ్గ విషయం. ఆమె ప్రతిభతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయబోతున్నారు.” అని మృణాల్ అభిప్రాయపడ్డారు.

ఎమర్జెన్సీ’పై ప్రేక్షకుల అంచనాలు

ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక సంఘటనల ప్రాముఖ్యత, కంగనా నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి.

Related Posts
మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి నిర్మల..
మనోజ్కు-వ్యతిరేకంగా-తల్ manchu manoj

మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదాలపై తల్లి నిర్మలదేవి స్పందించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టంగా చెప్పిన ఆమె, Read more

మాంసపు ప్రియులు జాగ్రత్త
chicken

చాలా మంది మాంసపు ప్రియులు చికెన్ ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు . ముఖ్యంగా రెస్టారెంట్ట్స్ లలో చేసే చికెన్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. Read more

విడాకులఫై క్లారిటీ ఇచ్చిన అభిషేక్
abhi aish

ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నటి నిమ్రిత్‌కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. గత కొంతకాలంగా ఈ Read more

Malavika Mohanan:ప్రభాస్ తో కలిసి నటించడం నా అదృష్టం:మాళవిక
Malavika Mohanan:ప్రభాస్ తో కలిసి నటించడం నా అదృష్టం:మాళవిక

మాళవిక మోహనన్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2013లో మలయాళ చిత్రం 'పెట్టం పోలె' ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె, మలయాళంతో పాటు Read more