indian train

రైల్వేలో వెయ్యికి పైగా ఉద్యోగాల భర్తీ

డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రం పలు ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. సెంట్రల్ బ్యాంక్, ఢిల్లీ టీచర్ రిక్రూట్‌మెంట్, ఒడిశా పోలీస్ రిక్రూట్‌మెంట్ తదితర జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వచ్చే నెల మొదటి వారం వరకు దరఖాస్తు గడువు ఉంది. ఇంకెందుకు ఆలస్యం నోటిఫికేషన్ నిశితంగా చదివి మీకు సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Advertisements

రైల్వేలో 1036 పోస్టులు
పన్నెండో తరగతి (ప్లస్ టూ) పూర్తిచేసిన అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 7 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. వచ్చే నెల 6వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తు చేయడానికి కనీస విద్యార్హత 12వ తరగతి.. పోస్టులనుబట్టి బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ, టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం B.Ed, D.El.Ed లేదా TET ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని రైల్వేశాఖ సూచించింది.

జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో అహ్మదాబాద్‌ 123, చెన్నై 58, గువహటి 43, హైదరాబాద్‌ లో 42 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 9వ తేదీతో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ, వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఒడిశా పోలీస్ శాఖలో..
ఒడిశా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 933 ఎస్ఐ, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.35,400 జీతం అందుకుంటారు. భారత పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. అయితే, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూల్స్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. దీంతోపాటు 432 పీజీటీ పోస్టుల భర్తీకి ఢిల్లీ టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Related Posts
Donald Trump: విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం
విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో చోటు చేసుకుంటోన్న మార్పులు.. భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి. ఇతర దేశాలతో Read more

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్
IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, Read more

IPL 2025: ఎస్ఆర్ హెచ్ జట్టులోకి రవచంద్రన్ స్మరన్‌
IPL 2025: ఎస్ఆర్ హెచ్ జట్టులోకి రవచంద్రన్ స్మరన్‌

ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పటికే అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్ప‌టికే రుతురాజ్ Read more

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో ఈ మార్పులు?
Uttarakhand UCC

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేసిన తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న Read more

×