ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ.తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలాగే ఈమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందుకుగాను ఆమె 21 లక్షల రూపాయల పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే ఆమె అదృష్టాన్ని చూసి అంతా సంబురపడిపోతుండగా.ఇప్పుడో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ పేరుతో మోనాలిసాను శారీరకంగా వాడుకోవాలనిచూస్తున్నాడని ఓ నిర్మాత చెప్పాడు. కుంభమేళాలో కనిపించి తన అందం, ముఖ్యంగా తేనె కళ్లతో అందరినీ ఆకర్షించింది చేసింది మోనాలిసా. అమాయకత్వం, అంతకుమించిన నవ్వుతోనే. సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది. దీంతో ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ముఖ్యంగా డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే ఆమె ఇంటికి వెళ్లి మరీ సినిమాపై అధికారికంగా సంతకం కూడా తీసుకున్నారు. అయితే ఆమె ప్రయాణం ఇలా సులభంగా సాగిపోలేదు. ఫేమ్ తర్వాత సినిమాకు ఛాన్స్ వచ్చినా, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవడంతో మోనాలిసా తన సినీ ప్రాజెక్ట్‌పై భయాందోళనకు గురవుతోంది.

ఓవర్‌నైట్ స్టార్
మోనాలిసా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన యువతి. ఆమె ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. అక్కడ ఉన్నప్పుడే ఓ నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో మోనాలిసా తేనె కన్నులతో, అమాయకమైన చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.ఆ ఫోటో వైరల్ కావడంతో మోనాలిసా ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఆమెను చూడటానికి, ఫోటోలు తీసుకునేందుకు జనం తండోపతండాలుగా రావడం ప్రారంభమైంది. ఇదే మోనాలిసాకు ఇబ్బందికరంగా మారింది. కొంతమంది ఆ హద్దులు మీరడంతో మోనాలిసా తన వ్యాపారాన్ని వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయింది.
సినిమా ఛాన్స్
సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించాడు. ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మోనాలిసా సంతకం కూడా చేసింది. ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం యాక్టింగ్‌పై శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని, ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని, ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని, ఆమెను తను వేధించడం లేదని, ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తోందని చెప్పుకొచ్చారు. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా విషయంపై దర్శకుడు, నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో తన మొదటి సినీ ప్రాజెక్టుపై మోనాలిసా ఆందోళన చెందుతోంది.