కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో, ఇటీవల కోర్టు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 8న బెంగళూరు సిటీ సెంట్రల్ హాల్ (సిసిహెచ్) 57వ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.పవిత్రతో సహా అనేక మంది నిందితులు కేసు విచారణకు హాజరయ్యారు. కానీ దర్శన్ రాలేదు. దీంతో దర్శన్ తీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యకం చేశాడు. విచారణ రోజున కోర్టుకు హాజరు కావడం తప్పనిసరి అని హెచ్చరించారు.
కోర్టు ఆగ్రహం
దర్శన్ సాకులు చెబుతూ కోర్టు విచారణను తప్పించుకు తిరుగుతున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కోర్టు విచారణకు హాజరుకాకుండా ఆయన చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ1గా ఉన్నారు నటుడు దర్శన్. గతంలోనే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే కోర్టు విచారణకు హాజరుకాకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. నడుంనొప్పితో విచారణ ఎగ్గొట్టిన ఆయన సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం రచ్చ అవుతోంది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఇటీవల కోర్టులో విచారణ జరిగింది. దీనికి దర్శన్ గైర్హాజరు అయ్యారు. నడుంనొప్పి కారణంగానే విచారణకు హాజరు కాలేకపోయారని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

స్పెషల్ స్క్రీనింగ్
కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉండాలని, ఇలాంటి సాకులు చెప్పి హాజరుకాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకావడం షాక్‌కు గురిచేసింది. బెంగళూరులోని ఒక ప్రముఖ థియేటర్‌లో జరిగిన ఈ స్క్రీనింగ్‌లో ఇతర చిత్రబృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు.సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది.అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతోపాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. డిసెంబరులో వీరికి బెయిల్ మంజూరు అయ్యింది .
Read Also: Atrocious : పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష