కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

Viral Video: కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

కామెడీ షోలో సభికులు చప్పట్లు కొడుతుంటే కమెడియన్‌ రెచ్చిపోయాడు. వెనకా ముందు చూసుకోకుండా కామెడీ పండించాడు. తన స్కిట్‌లోకి రాజకీయ నాయకులను లాగాడు. ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై జోకులు పేల్చాడు. అంత వరకు అయితే పర్వాలేదు అనుకున్నారు. కానీ, ఆయనను దేశద్రోహిగా పేర్కొన్నాడు. ఇంకేముంది రాజకీయ దుమారం చెలరేగింది. స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఇది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

ఏక్‌నాథ్‌ శిండేను ద్రోహిగా చిత్రీకరణ
ఖార్‌ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో కునాల్‌ కమ్రా షో నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశిస్తూ కమ్రా ఓ జోక్‌ పేల్చాడు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్‌.. ఏక్‌నాథ్‌ శిండేను ద్రోహిగా చెప్పుకొచ్చాడు.

పోస్టులో ఏంవుంది?
ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ‘కునాల్‌ కా కమల్‌’ అంటూ పోస్టులో రాశాడు. దీంతో ఇదికాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. కమెడియన్‌ కమ్రా వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు.
కమెడియన్‌ కునాల్‌ కమ్రాపై కేసు నమోదు..
కమెడియన్ కునాల్‌ కమ్రాపై చర్యలు తీసుకోవాలని శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. హోటల్‌పై దాడిని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్‌ పాడిన పాటలో వంద శాతం నిజమే ఉందన్నారు ఠాక్రే. కుట్రపూరితంగానే హోటల్‌పై దాడి చేశారని ఆరోపించారు.

Related Posts
ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi met MPs

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న Read more

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ
President's refusal to meet with farmers' association

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, Read more

దళపతి విజయ్‌ను షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు
thalapathy vijay

తమిళ హీరో దళపతి విజయ్ వరుస విజయాలతో తమిళనాడులో మాత్రమే కాకుండా,తెలుగులోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తూ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ సినిమాలు,రాజకీయాలు రెండింటినీ ఒకేసారి మెనేజ్ చేస్తూ తన Read more

Mukesh Ambani: టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్
టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *