Siddipet news:విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం. శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాల ప్రదానం. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (జిల్లా శాఖ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాల పంపిణీ, సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (జిల్లా శాఖ) ఆధ్వర్యంలో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ)లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాల పంపిణీ, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ధరిపల్లి నాగేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Read also: Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లో లభించే విజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం సులభమవుతుందని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ కవి, రచయిత, దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదపడాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సీఐ చేరువుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.
Siddipet news:జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలే మార్గాలు
ప్రముఖ వైద్యుడు డాక్టర్ శనిగరం అంతగిరి మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డంకి కాదని, సంకల్పంతో శ్రమిస్తే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. న్యాయవాది వర్కోలు రాజలింగం, విలాసాగరం తిరుపతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. మోటివేషనల్ స్పీకర్ రాదారి నాగరాజు మాట్లాడుతూ పదో తరగతి జీవితం మలుపు తిప్పే దశ అని, ఇక్కడితో ఆగకుండా మరింత కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విశ్రాంత ఉపాధ్యాయులు అనంతవరం మాణిక్యలింగం, ప్రముఖ కవయిత్రి అన్నవరం సుజాత విద్యార్థులకు పురస్కారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి ధరిపల్లి దుర్గయ్య సంఘం బలోపేతానికి, ఉద్యోగులు మరియు విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. కార్యక్రమం ముగింపులో పీజీహెచ్‌ఎం మద్దూరి రాములు అతిథులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కనకయ్య, తరిగొప్పుల శ్రీనివాస్, గోవిందారం శ్రీనివాస్, రామచంద్రం, రాములు, కృష్ణమూర్తి, చంద్రవాస్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: