Delhi terror plot : దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్ర మాడ్యూల్ ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఢిల్లీ-సోనిపట్ హైవేపై ఉన్న ఓ ప్రముఖ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ప్రసిద్ధ ఆలయం ప్రధాన టార్గెట్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కుట్ర అమలుకు ‘షహజాద్ భట్ మాడ్యూల్’కు చెందిన ఉగ్రవాదులను రంగంలోకి దించినట్లు దర్యాప్తులో తేలింది. వీరి కదలికలపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వారిని విచారిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
పట్టుబడ్డ నిందితుల్లో ఒకరు ఢిల్లీలోని ప్రముఖ ఆలయం వద్ద రహస్యంగా రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ, ప్రవేశ మార్గాలపై సమాచారం సేకరించి ఫోటోలు, వీడియోలను పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు పంపినట్లు తెలిసింది.
Read Also: Viral Love Story : ఖైదీని ప్రేమించి పెళ్లాడిన జైలర్.. వైరల్ స్టోరీ

ఆలయంలోకి ప్రవేశించి భక్తులు, సిబ్బందిపై కాల్పులకు పాల్పడాలని ముఠా వ్యూహం రచించినట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో దాడులు చేసి భయాందోళనలు సృష్టించడమే వీరి ప్రధాన లక్ష్యంగా గుర్తించారు.
ఈ ఉగ్ర మాడ్యూల్ వెనుక జమ్మూకశ్మీర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షహజాద్ భట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అతడి ఆదేశాలు, నిధుల ఆధారంగానే స్థానిక ఆపరేటివ్‌లు పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అరెస్టయిన నిందితులను లోతుగా విచారిస్తున్నామని, ఈ కుట్ర వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: