KCR releases song on BRS silver jubilee

KCR: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ.. పాట విడుదల చేసిన కేసీఆర్‌

KCR : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాటను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాట రచించి పాడారు. ‘బండెనుక బండి కట్టి… పోదాము రారన్నో…’’ అంటూ రసమయి బాలకిషన్‌ రాసి, పాడిన పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ ప్రస్థానంపై పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్‌కు కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisements
బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ పాట

జిల్లా పార్టీ నేతలకు సూచనలు

కాగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు జనం ఇప్పుడు బాధపడుతున్నారని కూడా అన్నారు. అయితే ఇదంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చో, ఏదో బహిరంగ సభలోనో చేసిన ప్రసంగం కాదు. తన తన ఫామ్ హౌస్ లో కూర్చునే చేసిన ఉపదేశం. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఈ నెల 24న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సూచలను ఇచ్చారు. సభకు పెద్ద ఎత్తు జనం స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పిన కేసీఆర్.. ఆ వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మనో ధైర్యాన్ని ఇచ్చే విధంగా రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. ఈ సభ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు వేస్తానన్న కేసీఆర్.. పార్టీ క్యాడర్ కు, నేతలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా దగాపడి

ఇక, ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుని కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయన్నారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా దగాపడి మనో ధైర్యాన్ని కోల్పోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజలలో ధైర్యం నింపే విధంగా రజతోత్సవ సభ నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు బుధవారం (ఏప్రిల్ 2) ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. కేసీఆర్ రజతోత్సవ సభకు సంబంధించి నేతలకు చేసిన దిశా నిర్దేశంతో.. రజతోత్సవ సభ వేదిక వరంగల్ నుంచి మేడ్చల్ కు మారుతుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది.

Related Posts
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఈడీ నోటీసులు
ED notices to former MLA Marri Janardhan Reddy

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులోని రూ. 1000 కోట్లకుపైగా విలువైన భూదాన్ భూములను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ప్రైవేటు పరం చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. Read more

Kerala: ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా పరిగెత్తించిన కంపెనీ వీడియో వైరల్
ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా నడిపించిన కంపెనీ వీడియో వైరల్

కేరళలోని కలూర్ ప్రాంతంలో జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీస్తోంది. తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులపై ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ వేసిన Read more

Bengal Assembly Elections : రాష్ట్రపతి పాలనలోనే బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
Bengal Assembly elections under President's rule

Bengal Assembly Elections : బంగాల్​లో రాష్ట్రపతి పాలనలలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more

తమిళ భాషపై స్టాలిన్ ఆందోళన
తమిళ భాషకు ముప్పు! స్టాలిన్ ఆందోళన వ్యక్తం

హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా హిందీ భాషను ఇతర రాష్ట్రాలపై Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×