kasthuri

పవన్ కళ్యాణ్ స్పందన పై కస్తూరి రియాక్షన్

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.

Related Posts
ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు
Harish Kumar Gupta is the new DGP of AP

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు Read more

టీడీపీలో చేరుతున్న తీగ‌ల కృష్ణారెడ్డి
Teegala Krishna Reddy joining TDP

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది Read more

అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్
అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో జరిగిన విధ్వంసంతో సంబంధం లేదన్న కాంగ్రెస్ ఈ ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో, ప్రధాన నిందితుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి Read more

హష్ మనీ కేసు..ట్రంప్‌కు భారీ ఊరట
Judge sentences Trump in hush money case but declines to impose any punishment

న్యూయార్క్‌ : అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు సంబంధించిన హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *