yogi adityanath

స్నానం కాదు ఆ నీళ్లు తాగే దమ్ముందా: అఖిలేష్ యాదవ్

దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి మద్దతు దారులను తెచ్చుకుంటూ ప్రచార కార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు అనేక మంది అభ్యర్థులు. అయితే గురువారం రోజు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ బీజేపీ తరఫున ఢిల్లీ ప్రచారానికి వెళ్లారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరుగుతూ.. ఢిల్లీలోని యమునా నదిని డంపింగ్ యార్డులా మార్చారంటూ విమర్శించారు. ప్రయాగ్ రాజ్‌లో నేను స్నానం చేశాను, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ యమునా నదిలో స్నానం చేయగలరా అంటూ కామెంట్లు చేశారు.

దీనిపై ఆప్ అధినేత స్పందించకపోయినా అఖిలేష్ యాదవ్ స్పందించారు. యూపీ సీఎం పేరు ప్రస్తావించకుండానే.. స్నానం చేయడం కాదు మీ రాష్ట్రంలోని యమునా నది నీళ్లు తాగే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు.
ముఖ్యంగా యమునా నదిని మురుగు కాలువగా మార్చిన ఘనత ఆప్‌కే చెందుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా మహా కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి తాను ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించానని స్పష్టం చేశారు. అయితే అర్వింద్ కేజ్రీవాల్.. ఇక్కడున్న యమునా నదిలో మునగగలరా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రస్తావించకుండానే.. గట్టిగా కడిగేశారు. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts
జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
jammu

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.జమ్ములోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. చోటుచేసుకున్నాయి. . Read more

పార్కింగ్ విషయంలో యువ శాస్త్రవేత్త హతం
పార్కింగ్ వివాదం.. శాస్త్రవేత్త పై అమానుష దాడి!

జీవితాన్ని విజ్ఞానానికి అంకితం చేసిన ఓ శాస్త్రవేత్తకు పార్కింగ్ స్థల వివాదమే మృత్యువుకు కారణమైంది. ఇటీవలే ఆరోగ్య సమస్యలతో స్విట్జర్లాండ్ నుండి భారత్‌కు వచ్చిన అతడు, పంజాబ్‌లో Read more

ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు
ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు

ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిషస్‌ చేరుకున్నారు. పదేళ్ల విరామం Read more

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అమరావతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల సమావేశం కీలకంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది. Read more