అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

Assembly: అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో 41వేల కోట్లు అప్పులు చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ అన్నారు.
డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు
ఒక జర్నలిస్టు ఎవరో కేటీఆర్ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగురవేసి అక్కడి సమాచారం తనకు అందించాడని..దాన్ని మీడియా ద్వారా బయటపెట్టినందుకు ఎంపీగా ఉన్న తనను డిటెన్షన్ సెల్‌లో నిర్భంధించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. సాధారణంగా అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరు అంతా ఇంతా కాదని చాలా అన్యాయంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లికి లగ్నపత్రిక రాసుకుంటుండుగా తనను బెయిల్‌ పై విడుదల చేయాలని కోరగా… బెయిల్ రాకుండా నాడు అడ్డుకున్నారని గుర్తుచేశారు. చివరకు బెయిల్ పై విడుదలై తన బిడ్డ పెళ్లికి హాజరై తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లినట్లు రేవంత్ రెడ్డి సభలో చెప్పారు.

Advertisements
Related Posts
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
indra sena reddy

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 Read more

తమపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేటీఆర్
తమపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేటీఆర్

మాపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేసులో కేటీఆర్, కవిత ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ Read more

Shravan Rao : నాలుగవసారి సిట్ ఎదుట విచారణకు హాజరు
Shravan Rao

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ప్రముఖ మీడియా అధినేత Shravan Rao మరోసారి సిట్ అధికారులు విచారించారు. ఇది Read more

Minister Sridhar Babu : ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
More than 70 global capability centers within a yea.. Minister Sridhar Babu

Minister Sridhar Babu : హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన సిటిజన్స్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో సిటిజన్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×