Rashmika Mandanna: గాయం నుంచి కోలుకోడానికి సమయం పడుతుంది:రష్మిక

Rashmika Mandanna: గాయం నుంచి కోలుకోడానికి సమయం పడుతుంది:రష్మిక

పాన్ ఇండియా హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో తన ప్రత్యేకమైన ముద్ర వేసింది , ఇప్పుడు స్టార్ హీరోలు కూడా రష్మిక డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది రష్మిక. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. అలాగే ఓ అభిమాని కాలికి తగిలిన గాయం గురించి అడగ్గా రష్మిక ఇలా సమాధానం ఇచ్చింది. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని, కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని తెలిపింది రష్మిక. కాగా నొప్పి ఉన్న కూడా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు బెటర్ గానే ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisements

అరడజను సినిమాలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న . ఇటీవలే పుష్ప 2, ఛావ సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు అరడజను కు పైగా సినిమాల్లో నటిస్తుంది. కాగా ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె కుడి పాదానికి గాయం కావడంతో సినిమా షూటింగ్‌ల నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది. కాలు నొప్పి ఉన్న కూడా ఛావ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంది. వీల్ చైర్ లోనే ప్రమోషన్స్ కు వచ్చింది రష్మిక మందన్న. 

బ్లాక్‌బస్టర్ విజయాలు

పుష్ప 2’ సినిమాతో రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ సరసన ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.‘ఛావా’ సినిమాతోనూ మళ్లీ తన నటనను రుజువు చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రాజెక్టులు

ప్రస్తుతం రష్మిక ‘సికందర్’, ‘కుబేర’, ‘థమ్’ వంటి చిత్రాల షూటింగ్‌లో ఉన్నాయి. సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలోనూ రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ సినిమాలు , తెలుగులోనూ ఒకటి రెండు సినిమాలకు సైన్ చేసింది రష్మిక.

రష్మిక కామెంట్స్

అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రష్మిక “నా కాలికి గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పూర్తిగా కోలుకోవాలంటే 9 నెలలు పడుతుంది. అయినా నొప్పిని తట్టుకుని సినిమాల్లో బిజీగా ఉంటాను” అని చెప్పింది.ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా నిలుస్తోంది.స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆమెతో సినిమా చేయాలని ఆశక్తి చూపుతున్నారు.

Related Posts
అనసూయ వచ్చిందని ఆర్టీసీ బస్టాండ్‌‌ క్లోజ్.! ఎక్కడంటే
anasuya bharadwaj

ప్రయాణికుల అసహనం పెరిగింది ఆర్టీసీ అధికారుల చర్యపై. తాజాగా కడప జిల్లా మైదుకూరు పట్టణంలో జరిగిన సంఘటనలో ఆర్టీసీ అధికారులు అనవసరంగా బస్టాండ్‌ను మూసివేసి ప్రయాణికులను ఇబ్బందులకు Read more

తండ్రీ కొడుకులిద్దరి పేర్లు తీస్తూ, నయనతార వివాదం…ఓపెన్ లెటర్
nayanthara 2

దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్‌స్టార్ నయనతారల మధ్య జరుగుతోంది. ఈ Read more

మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సంబరాలు
అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన,

దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.అన్ని వయసుల వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సంబరాల్లో Read more

ప్రేక్షకుల ముందుకు రానున్న ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్
ప్రేక్షకుల ముందుకు రానున్న ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్

జియో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'ఊప్స్ అబ్ క్యా' వెబ్ సిరీస్ వచ్చింది. శ్వేతాబసు ప్రసాద్ - ఆషిమ్ గులాటి ప్రధానమైన పాత్రలను పోషించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×