US-Iran War : మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి ప్రత్యక్ష దాడులకు దారితీసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని వ్యూహాత్మక లారాక్ ఐలాండ్ (Larak Island) లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణి దాడులు నిర్వహించాయి. జలసంధి అయిన హార్ముజ్ (Strait of Hormuz) మార్గంలో ఇరాన్ మైన్లను (నౌకా వ్యతిరేక గనులను) ప్రయోగిస్తోందనే బలమైన అనుమానంతోనే లారాక్ దీవిలోని ఇరానియన్ రాకెట్ లాంచర్లపై అమెరికా ఈ క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం. ఈ హఠాత్ పరిణామంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also : ధరా సముద్రంలో ఘోర ప్రమాదం..మునిగిన బోటు 280 మంది మునక

ఇరాన్ ప్రతిదాడులు: జోర్డాన్‌లోని యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపాటు
లారాక్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన సైనిక చర్యకు ఇరాన్ తక్షణమే ప్రతిదాడితో విరుచుకుపడింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను (US Military Bases in Jordan) లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, రాకెట్లతో ప్రతిదాడులకు తెగబడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎదురెదురు దాడులతో పర్షియన్ గల్ఫ్ మరియు పశ్చిమాసియా ప్రాంతాల్లో పూర్తిస్థాయి యుద్ధ భయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లో ఘర్షణలు తీవ్రతరం కావడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :