Russia Plane Missing : 189 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్.. కాకపోతే !!

Follow Us: Google News Daily Hunt
Russia Plane Missing : 189 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్.. కాకపోతే !!
FONT SIZE
GET APP

Russia Plane Missing : రష్యాలో వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక విమానం గాల్లో కాసేపు తీవ్ర కలకలం రేపింది. రష్యన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ భారీ ప్యాసింజర్ విమానం మొత్తం 189 మంది ప్రయాణికులతో రష్యాలోని సోచీ (Sochi) నగరం నుంచి ఆర్ఖాంజెల్స్క్ (Arkhangelsk) నగరానికి బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నల్లసముద్రం (Black Sea) వాయుతల పరిధిలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా రాడార్ స్క్రీన్ల నుంచి అదృశ్యమైంది. విమానంతో సంబంధాలు తెగిపోవడానికి సరిగ్గా కొన్ని క్షణాల ముందు, పైలట్ నుంచి అత్యవసర ప్రమాద సంకేతమైన ‘SOS’ రావడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. విమానం నల్లసముద్రంలో కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలతో రష్యా రెస్క్యూ బృందాలు కూడా తక్షణమే అలర్ట్ అయ్యాయి.

Read Also : మోదీ పై ట్రంప్ ప్రశంసలు

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు!

క్రాష్ ల్యాండింగ్ భయాల మధ్య కొద్దిసేపటికే రష్యా అధికారిక మీడియా ఒక ఊరటనిచ్చే వార్తను వెల్లడించింది. రాడార్ నుంచి అదృశ్యమైన ఆ విమానాన్ని పైలట్లు అత్యంత చాకచక్యంగా తిరిగి సోచీ విమానాశ్రయానికే మళ్లించి, అక్కడ సురక్షితంగా ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’ (అత్యవసర ల్యాండింగ్) చేసినట్లు ప్రకటించారు. విమానంలోని ఇంజిన్లలో ఒకటి సాంకేతిక లోపం కారణంగా పూర్తిగా విఫలం (Engine Failure) కావడంతోనే ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గాల్లో ఇంజిన్ మొరాయించినా, పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి 189 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు