New York: పిడుగుపాటు అంటేనే ప్రాణాంతకమైన ప్రమాదంగా భావిస్తారు. చాలాసార్లు పిడుగు తాకినవారు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలకు గురికావడం జరుగుతుంది. అయితే న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నేరుగా పిడుగు తాకినప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. మృత్యువును తృటిలో తప్పించుకున్న అతడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
న్యూయార్క్‌లోని స్టేటెన్ ఐలాండ్‌కు చెందిన థామస్ ఫామీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అప్పటికే బయట వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకుని ఇంటి ఆవరణ నుంచి వీధిలోకి అడుగుపెట్టాడు. ఇంతలో ఒక్కసారిగా భారీ పిడుగు అతడికి సమీపంలోనే పడింది. పెద్ద శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లగా, పిడుగుపాటు ప్రభావానికి థామస్ అక్కడికక్కడే నేలపై కుప్పకూలిపోయాడు.
Read Also : Rubio Reacts : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో ప్రధాని మోదీ భేటీపై స్పందించిన రూబియో

New York: సీసీటీవీలో రికార్డైన పిడుగుపాటు దృశ్యాలు
పిడుగుపాటు ధాటికి ఒక్కసారిగా నేలపై పడిపోయిన థామస్.. కొద్దిసేపటికే స్పృహలోకి వచ్చినట్లు కనిపించారు. కేవలం కొన్ని సెకన్లలోనే తేరుకున్న ఆయన మెల్లగా పైకి లేచి నిలబడ్డారు. అనంతరం ఎలాంటి సాయం లేకుండానే నడుచుకుంటూ తిరిగి ఇంట్లోకి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ఆయన ఇంటి ముందు ఏర్పాటు చేసిన డోర్‌బెల్ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టే ప్రాణాలతో బయటపడ్డారు’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
థామస్ ఫామీ స్పందిస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. పిడుగు తాకిన సమయంలో శరీరమంతా ఒక్కసారిగా తిమ్మిరిగా మారినట్లు, తీవ్రమైన జలదరింపుతో పాటు ఒళ్లంతా మంటగా అనిపించిందని తెలిపారు. అంతటి ప్రమాదం జరిగినప్పటికీ ఎముకలు విరగకపోవడం, ఎలాంటి తీవ్రమైన అంతర్గత గాయాలు కాకపోవడం తన అదృష్టమని చెప్పారు. ఇది నిజంగా ఒక అద్భుతమేనని, మృత్యువుకు అతి దగ్గరగా వెళ్లి తిరిగి ప్రాణాలతో బయటపడిన ఈ ఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని థామస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :