White House: ట్రంప్‌ పై కాల్పుల ఘటనపై కరోలిన్ లీవిట్ సంచలన కామెంట్లు

Follow Us: Google News Daily Hunt
White House
White House
FONT SIZE
GET APP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వాషింగ్టన్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ విందులో ట్రంప్ పాల్గొన్న సమయంలో జరిగిన ఈ దాడిని వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. దీనిని ” వామపక్షాల ద్వేషపూరిత కుట్ర “గా అభివర్ణిస్తూ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో ట్రంప్‌పై జరిగిన మూడవ హత్యాయత్నం ఇదేనని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Iraq New Prime Minister: ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ

White House
White House

White House: విపక్షాలు, విమర్శకుల వల్లే ఈ దాడులు జరిగాయంటూ..!

వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. విపక్షాలు, విమర్శకులు అనుసరిస్తున్న ధోరణే ఇలాంటి హింసకు ప్రేరణ ఇస్తోందని ఆరోపించారు. “ట్రంప్‌ను నిరంతరం ఫాసిస్ట్ అని, ప్రజాస్వామ్యానికి ముప్పు అని, హిట్లర్‌తో పోలుస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారు.. పరోక్షంగా ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ద్వేషపూరిత భావజాలం కారణంగా ఇప్పటికే పలువురు గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగింది కూడా అలాంటి ఘోరమైన దాడే” అని ఆమె పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు