Imran Khan Health: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆయన ఆరోగ్యంపై ఆయన కుమారులు ఖాసిం, సులేమాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి సరైన వైద్యం అందకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ అంతర్జాతీయ న్యాయవాది జేర్డ్ గెన్సర్‌తో కలిసి వారు ఈ వివరాలను వెల్లడించారు.
Read Also :Islamabad Hospital Fire: ఇస్లామాబాద్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి

విలేకరుల సమావేశంలో కుమారులు చేసిన తీవ్ర ఆరోపణలు
- కంటి చూపు నష్టం: గడిచిన మూడేళ్లుగా కిటికీలు లేని 6×8 అడుగుల చిన్న గదిలో రోజుకు 23 గంటలకు పైగా బంధించడం, సరైన వైద్యం అందించకపోవడం వల్ల ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపును దాదాపు కోల్పోయారని ఖాసిం తెలిపారు.
- ‘స్లో-మోషన్ హత్య’: ప్రస్తుత జైలు పరిస్థితుల్లో ఆయన ప్రాణాలతో బయటపడటం కష్టమని, ఈ నిర్బంధం ఒక “స్లో-మోషన్ హత్య” (Slow-motion murder) లాంటిదని ఆయన అంతర్జాతీయ న్యాయవాది ఆరోపించారు.
- కమ్యూనికేషన్ కట్: గత ఆరు నెలలుగా తమ తండ్రితో ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సులేమాన్ అన్నారు. ఈ హింస వెనుక పాకిస్థాన్ సైనిక యంత్రాంగం హస్తం ఉందని ఆరోపించారు.
- సుప్రీంకోర్టు ఉత్తర్వులు పక్కనబెట్టి: ఇమ్రాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన ఫిట్‌గా ఉన్నారని ప్రకటించడాన్ని తప్పుబట్టారు.
Imran Khan Health: అంతర్జాతీయ స్పందన & న్యాయ పోరాటం
- దిగ్గజ క్రికెటర్ల లేఖ: ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణమే సముచితమైన వైద్య సదుపాయాలు అందించాలని కోరుతూ 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధానికి ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
- రివ్యూ పిటిషన్: ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
- కోర్టు ధిక్కరణ విచారణ: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సెప్టెంబర్ 16న విచారించేందుకు కోర్టు సమయం నిర్ణయించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :