Heavy Rains Central Japan: జపాన్‌లో కుండపోత వర్షాలు.. నాగోయాలో రికార్డు స్థాయి వర్షపాతం!

Follow Us: Google News Daily Hunt
Heavy Rains Central Japan
Heavy Rains Central Japan
FONT SIZE
GET APP

Heavy Rains Central Japan: మధ్య జపాన్‌లోని నాగోయా (Nagoya), ఐచి (Aichi) ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమై తీవ్ర వరదలు సంభవించాయి. నాగోయా నగరంలో కేవలం ఒకే గంటలో ఏకంగా 104.5 మిమీ వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంత చరిత్రలోనే ఇది ఆల్-టైమ్ రికార్డు స్థాయి వర్షపాతంగా అధికారులు వెల్లడించారు.

Read Also : Indian Engineer : మాస్కోలోని తన ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన భారతీయ ఇంజనీర్

Heavy Rains Central Japan
Torrential rains in Japan… Record-breaking rainfall in Nagoya!

Heavy Rains Central Japan: స్తంభించిన రవాణా వ్యవస్థ.. మెట్రో సేవల నిలిపివేత

రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో నగరంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రైలు పట్టాలపైకి భారీగా నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. దీనితో నిత్యం రద్దీగా ఉండే నాగోయా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.

కొండచరియల ముప్పు.. అత్యవసర భద్రతా హెచ్చరికలు

భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడే (Landslides) ప్రమాదం పొంచి ఉండటంతో వాతావరణ శాఖ అత్యవసర భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు