I will not leave Jagan no matter how much he harasses me.. Perni Nani

Perni Nani : ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్‌ను విడిచి వెళ్లను : పేర్ని నాని

Perni Nani : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినా కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. కక్ష సాధింపులో భాగంగా తమపై కేసులు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీని వీడిచే ప్రసక్తి లేదన్నారు.

Advertisements
ఎన్ని వేధింపులకు గురి చేసినా

తనను జైలుకు పంపించిన పర్వాలేదు

రేషన్ బియ్యం కుంభకోణం కేసులో పెర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఇలాంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపించిన పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వీడేది లేదన్నారు. తమ కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ మరెవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని పేర్ని నాని అన్నారు.

ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదు

సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదని సీజ్ ది షిప్, సీజ్ ది గోడౌన్ అన్నాకూడా ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని చెప్పారు. వాళ్లందరిపై కేవలం 6ఏ కేసు మాత్రమే పెట్టారని తెలిపారు. తనకు ముందు కానీ… తన తర్వాత కానీ ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసు పెట్టలేదని చెప్పారు. తనపై కక్ష కట్టారనే విషయం దీంతో అర్థమవుతుందని అన్నారు. తనను, తన భార్యను, తన కొడుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని చెప్పారు.

Related Posts
భారతదేశం AI రంగంలో టాప్ 10లో, సాంకేతిక అభివృద్ధిలో ముందడుగు
INDIA AI

భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆవశ్యకత లో టాప్ టెన్ దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది దేశం యొక్క సాంకేతిక పురోగతికి కీలకమైన సూచన. AI రంగంలో Read more

విశాఖ పోర్టు రికార్డ్
vizag port

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి మొత్తం Read more

YSRCP: రెండు సభల్లో వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
YCP opposes Waqf Amendment Bill in both houses

YSRCP : వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. బుధవారం లోక్‌సభలో Read more

2027 లో నాసిక్ లో మళ్ళీ కుంభమేళా
ప్రపంచవ్యాప్తంగా భక్తుల దృష్టి 2027 నాసిక్ కుంభమేళాపై!

అత్యంత భారీ మతపరమైన వేడుక అయిన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. మహాశివరాత్రి రోజున ఈ మహోత్సవం అధికారికంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×