Hyderabad : అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు మరియు అగ్ని ప్రమాదాల నుండి రక్షించేందుకు జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రా (HYDRA) సంయుక్తంగా కొత్త ప్రణాళికను రూపొందించాయి. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలం నప్పుడు వచ్చే వరద భయాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

సంయుక్త సమీక్ష అనంతరం కీలక నిర్ణయాలు
ఈ నిర్ణయాల సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్ని ప్రమాదాల నివారణ, వరద ముంపు నివారణ మరియు వర్షాకాల చర్యలు వంటి కీలక అంశాలపై చర్చించారు.
వివిధ విభాగాల మధ్య సమన్వయంతో కమిటీల ఏర్పాటు
అగ్ని ప్రమాదాల నివారణ కమిటీ ఒక కమిటీని ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో అగ్నిమాపక శాఖ, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు కలిసి పనిచేస్తాయి. వరద ముంపు నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కార కమిటీ వర్షాకాలంలో వరద ముంపు నివారణ, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ట్రాఫిక్ శాఖ, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు కలసి సమన్వయంతో ముందుకు సాగనున్నారు.
హైదరాబాద్‌లో భద్రతకు మరింత ప్రాధాన్యత
ఈ చర్యల ద్వారా హైదరాబాద్ నగర భద్రతను పెంపొందించడంతో పాటు వర్షాకాలంలో కలిగే ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యమని GHMC, HYDRA అధికారులు స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.