చంద్రునిపై పరిశోధనలు సాగించేందుకు, మానవ నివాసాలను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు కొనసాగిస్తుండగా, మరో కీలక సమస్యపై నాసా దృష్టి సారించింది.దాదాపు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు.లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు.రోదసిలో మనుషుల వ్యర్థాలతోపాటు ఫుడ్ ప్యాకేజింగ్, బట్టలు, పాడైన పరికరాలూ ఉన్నాయని పేర్కొంది. ఈ ఛాలెంజ్‌లో రెండు ట్రాక్‌లు ఉంటాయి. బృందాలుగా, వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు. ప్రవేశ రుసుము లేదు. ట్రాక్-1లో కఠినమైన చంద్రుని వాతావరణంలో పనిచేసే ఫుల్ రిసోర్స్ రికవరీ సిస్టమ్ డిజిటల్ మోడల్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్-2లో ఇలాంటి సిస్టమ్‌లో వినియోగించదగిన ముఖ్యమైన కాంపొనెంట్ లేదా సబ్‌సిస్టమ్ వర్కింగ్ ప్రోటోటైప్‌ను నిర్మించడం, ప్రదర్శించడంపై దృష్టి పెట్టాలి.
25 కోట్లు
చంద్రుడిపైనే ఉండిపోయిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న నాసా లూనా రీసైకిల్ పేరిట ఒక ఛాలెంజ్‌ను ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి దాదాపు రూ.25 కోట్లు అందజేస్తామని తెలిపింది.చంద్రుడిపైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ ద్వారా మళ్లీ వినియోగిస్తుంటారు. అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా, తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ నాసా ఒక ఛాలెంజ్ ప్రకటించింది. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను కనుగొనాలని చూస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అమెరికాతో పాటు జాబిలిపై పరిశోధనలు సాగిస్తున్న భారత్ వంటి దేశాలకూ ఉపయుక్తంగా ఉంటుంది.

భూమికి తీసుకురావడం
భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలు ఏర్పాటు లక్ష్యంగా నాసా ఆర్టెమిస్ మిషన్‌పై పనిచేస్తోంది. దానికి ముందు చంద్రుడిపై ఉన్న మాన వ్యర్థాలను నిర్వహణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కువ సమయం పట్టే అంతరిక్ష మిషన్లలో అన్ని వనరులు టైట్‌గా నిర్వహించడం, తిరిగి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఆ వ్యర్థాలను తిరిగి భూమికి తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు నాసా ఇన్-సిటు ప్రాసెసింగ్ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ ఛాలెంజ్ ఇచ్చింది.
Read Also: Bill Gates:రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుంది: బిల్ గేట్స్