సునీతా విలియమ్స్ కేవలం 8 రోజుల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె 286 రోజులు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా, ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో తన విధులను నిర్విఘ్నంగా కొనసాగించారు. శారీరక, మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు.
భూమికి రాగానే వైద్య పరీక్షలు
నిజానికి అంత రాత్రి అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి తిరిగి రావడం సులభం కాదు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మళ్లీ భూమికి వచ్చాక, ఆ మార్పుల ప్రభావం తగ్గించుకోవడానికి సమయమౌతుంది. తాజాగా, సునీతా విలియమ్స్ క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ సహాయంతో బయటకు వచ్చారు. అయినప్పటికీ, చేయి ఊపుతూ నవ్వుతూ అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు.
అంతరిక్ష ప్రభావం – 45 రోజుల వైద్య పర్యవేక్షణ
అంతరిక్షంలో గడిపిన అనుభవం శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కండరాల బలహీనత, ఎముకల దృఢత్వం తగ్గిపోవడం, రక్తప్రసరణ మారడం, తలనొప్పి, తేలికపాటి త్రిప్పులు రావడం వంటి సమస్యలు వ్యోమగాములు ఎదుర్కొంటారు. ఇందుకోసం ఆమెను 45 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ప్రత్యేకమైన వ్యాయామాలు, పోషకాహారంతో శరీరాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది.

సాహసానికి, మనోబలానికి నిదర్శనం
ఎన్ని కష్టాలు వచ్చినా, సునీతా విలియమ్స్ ధైర్యాన్ని కోల్పోకుండా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వ్యోమగాములుగా అంతరిక్షంలో ఉండే ప్రతికూలతలను తట్టుకొని, భూమికి తిరిగి రావడం నిజమైన సాహసమే. భవిష్యత్ తరాలకు ఆమె ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకునే దిశగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి సామాన్య జీవితానికి వచ్చేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.