బాలిక పై సామూహిక లైంగికదాడి

Krishna District: బాలిక పై సామూహిక లైంగికదాడి

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 9న పక్కింటి మహిళతో కలిసి వీరపనేనిగూడెం గ్రామానికి వచ్చింది. అయితే 13వ తేదీన ఏదో వివాదం కారణంగా ఆ ఇంటినుంచి బయటకు వచ్చేసింది.బాలిక ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే మరో యువకుడు బాలిక వద్దకు వెళ్లి బైక్‌పై జి.కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అనిల్, జితేంద్ర అనే ఇద్దరు యువకుల వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆపై కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.ఆమెను ఆటోలో తీసుకొచ్చి మాచవరంలో వదిలిపెట్టారు. 

Advertisements

బాలికను కాపాడిన ఆటో డ్రైవర్

ఆమె పరిస్థితి చూసి అనుమానించిన ఓ ఆటోడ్రైవర్ వివరాలు కనుక్కొని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బాలికను అప్పగించాడు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కేసు నమోదు

బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె నుంచి ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అభం శుభం తెలియని బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి అనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, మహిళా భద్రతపై మరింత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. బాధితురాలికి సమాజం అండగా ఉండి, ఆమెకు న్యాయం జరగేలా చేయాల్సిన అవసరం ఉంది.ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.మహిళల భద్రతపై అవగాహన కల్పించాలి – ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రమాద పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, స్వీయరక్షణ ఎలా చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

Related Posts
ఏపీలో భరోసా పింఛన్ల పంపిణీ
pention

ఏపీలో కూటమి ప్రభుత్యం వచ్చాక, ఎన్నికల హామీలో భాగంగా పేదలకు భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో Read more

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ
రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె Read more

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్
AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more

Vontimitta : ఒంటిమిట్ట శ్రీ‌సీతారాముల‌ కళ్యాణం.. 70వేల తిరుమ‌ల ల‌డ్డూలు
Sri Sitaram wedding in Vontimitta.. 70 thousand Tirumala laddus

Vontimitta : శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×