రాశి ఫలాలు

March 15 : శనివారం రాశిఫలాలు… ఈ రాశులవారికి నేడు..?

నేడు మార్చి15 శనివారం. నేటి పంచాంగం సహా, రాశిఫలాలు చాంద్రమానాన్ని అనుసరించి ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో ఈనాటి దినఫలాల్లో తెలుసుకుందాము.

Advertisements

మార్చి 15, 2025 శనివారం.తిథి బహుళ పక్ష పాడ్యమి మధ్యాహ్నం 02.33 నిమిషాల వరకు తదుపరి బహుళపక్ష విదియ.నక్షత్రం ఉత్తర ఫాల్గుణి ఉదయం 08.54 నిమిషాల వరకు తదుపరి హస్త .రాహుకాలం ఉదయం 09.26 నిమిషాల నుండి 10.55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 08.03 నిమిషాల నుండి 08.50 నిమిషాల వరకు.వర్జ్యం సాయంత్రం 06.18 నిమిషాల నుండి రాత్రి 08.05 నిమిషాల వరకు.యమగండకాలం మధ్యాహ్నం 01.54 నిమిషాల నుండి 03.23 నిమిషాల వరకు. చాంద్రమానాన్ని అనుసరించి మేషం నుండి మీనం వరకు 12 రాశులకి నేడు ఎలా ఉండబోతుందో ఈ జాతక ఫలాల్లో తెలుసుకుందాము. రాశిఫలాలు రాశిఫలాలు రాశిఫలాలు

మార్చి 15 శనివారం రాశిఫలాలు

నేడు మార్చి15 శనివారం. నేటి పంచాంగం సహా, చాంద్రమానాన్ని అనుసరించి ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో ఈనాటి దినఫలాల్లో తెలుసుకుందాము.

నేటి పంచాంగం

మార్చి 15, 2025 శనివారం.తిథి బహుళ పక్ష పాడ్యమి మధ్యాహ్నం 02.33 నిమిషాల వరకు తదుపరి బహుళపక్ష విదియ.నక్షత్రం ఉత్తర ఫాల్గుణి ఉదయం 08.54 నిమిషాల వరకు తదుపరి హస్త .రాహుకాలం ఉదయం 09.26 నిమిషాల నుండి 10.55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 08.03 నిమిషాల నుండి 08.50 నిమిషాల వరకు.వర్జ్యం సాయంత్రం 06.18 నిమిషాల నుండి రాత్రి 08.05 నిమిషాల వరకు.యమగండకాలం మధ్యాహ్నం 01.54 నిమిషాల నుండి 03.23 నిమిషాల వరకు.

మేషం

ఈ రోజు ఒడిదొడుకులు కొంచం ఎక్కువగా ఉంటాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ భాగస్వామితో కలసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటికి వచ్చిన అనుకోని అతిథి కారణంగా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.ఈ రోజు సాయంత్రం ప్రకృతిలో ఎక్కువ సమయం గడపకండి.

వృషభం

మీ పై అధికారుల ప్రశంసల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి నుంచి మద్దతు పొందుతారు. పిల్లల చదువుకి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల సహకారంతో ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి..ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

మిథునం

అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రారంభించిన పనుల్లో పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఆస్తి సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అదనపు బాధ్యతలు వస్తాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.

కర్కాటకం

మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన వార్త వింటారు. దుబారా ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో వారితో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి .ప్రకృతిలో సమయం గడపడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచుకోండి.

సింహం

ఆర్ధిక పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.కుటుంబంతో కలిసి గుడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు .వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.ప్రాపర్టీ కొనాలి అనుకునే వారు కొన్ని రోజులు ఆగితే మంచిది. ఉద్యోగులు పై అధికారుల మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.యోగా,ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి.

కన్య

ఇతరుల విషయాల్లో తక్కువ జోక్యం ద్వారా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ఉన్నతాధికారుల సహకారంతో ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మొదలు పెట్టన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వాహనం నడిపేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి.విద్యార్థులు తగిన గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

తుల

అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి.ఈ రోజు సాయంత్రం బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపార రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.మీ భాగస్వామితో కలసి దైవ దర్శనం చేసుకుంటారు. పని కారణంగా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

ఉద్యోగాల్లో మీ పనికి మెచ్చి అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెండింగు పనులు పూర్తవుతాయి. ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది.ఈ రోజు ఉదయం శుభవార్తలు వింటారు.

ధనస్సు

వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆఫీస్ లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ చిన్ననాటి sఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో కొంచెం ఒడిదుడుకులు ఏర్పడవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవు తాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. పిలల్లతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు.

మకరం

ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ ,ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం జరగవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బాగా అనుకూలంగా ఉంది. మీ బంధువులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్తత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభం

వృథా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.వ్యాపారంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.వాహన యోగం కలదు.

మీనం

మీ ప్రతిభ కారణంగా పై అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

Related Posts
Today Horoscope – Rasi Phalalu : 11 April 2025
Today Horoscope 11 April 2025

కన్య రాశిలో చంద్రుడి సంచారం.. Today Horoscope 11 April 2025 Horoscope రాష్ట్రీయ మితి ఛైత్ర , శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, Read more

Today Horoscope – 28 March 2025
Today Horoscope – 28 March 2025

Today Horoscope – 28 March 2025 Horoscope మేష రాశిలో చంద్రుడి సంచారం.. రాష్ట్రీయ మితి ఛైత్ర 2, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల Read more

Day In Pics: జ‌న‌వ‌రి 19, 2025
day in pic 19 1 25 copy

అగర్తలాలో ఆదివారం కోక్‌బోరోక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్ర‌జ‌లు న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌ ఆమరణ నిరాహార Read more

Day In Pics ఫిబ్ర‌వ‌రి 19, 2025
19 2 25 day in pic copy

భువనేశ్వర్‌లోని మిషన్ శక్తి సంస్థను పునర్నిర్మించాలన్న బిజెపి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బుధ‌వారం ఒడిశా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న Read more

×