ఇటీవలి కాలంలో మహిళల్లో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.గుండె జబ్బులను ముందుగా గుర్తించలేకపోతున్నారు.గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ప్రాణాంతకం కావచ్చు. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరానికి నష్టం వాటిల్లినప్పుడు ఇది సంభవిస్తుంది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొన్నింటిని గుర్తించకపోవచ్చు. ఈ రోజుల్లో పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువగా గుండెపోటు వస్తుంది. మహిళల్లో గుండెపోటు హెచ్చరిక సంకేతాలు కొంచెం భిన్నంగా,ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది.
లక్షణాలు
చాలామంది మహిళలు గుండెజబ్బు లక్షణాలను జీర్ణ సమస్యలుగా పొరబడుతుంటారు. వికారంగా ఉండటం, వాంతులు, ఛాతీలో మంటను గ్యాస్, అల్సర్‌గా భావిస్తారు. అయితే, ఇలా కడుపులో అసౌకర్యంగా ఉండటం కూడా గుండె సమస్యకు సంకేతమే,ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా కొందరిలో అకస్మాత్తుగా చెమటలు పడుతుంటాయి. కానీ, చాలామంది ఆందోళనతో వచ్చే చెమటగా భావిస్తుంటారు. గుండెపోటు వచ్చేముందు చెమటలు పడుతుంటాయి.మహిళల్లో ఎక్కువగా మెడ, దవడ, వీపు పైభాగంలో, భుజాలలో అసౌకర్యంగా ఉంటుంది. కానీ, చాలామంది కండరాల ఒత్తిడిగా భావిస్తుంటారు. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తుంటారు.తేలికపాటి పని చేసినా కొందరిలో శ్వాస ఆడదు.
గుండెపోటు
ఈ సమస్యను ఆందోళన, శ్వాసకోశ సమస్యగా పొరపాటు పడుతుంటారు. వైద్య సేవలకు నిరాకరిస్తారు. ఇదికూడా గుండె సమస్యకు సంకేతమే.బలహీనంగా ఉండటం, తల తిరగడం, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం కూడా గుండె సమస్యకు సంకేతమే. సరిగ్గా తినకపోయినా ఇలాంటి సమస్యలే కనిపిస్తాయి.పురుషులలో, గుండెపోటు నొప్పి సాధారణంగా ఎడమ ఛాతికి వస్తుంది.హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, అలసట, భుజాలు, మెడ, వీపు, లేదా ఎడమ చేయిలో నొప్పి, నిద్రలేమి. ఈ నొప్పి ఎటువంటి కారణం లేకుండా వస్తే దానిని లైట్ తీసుకోవద్దు.

మహిళలు గుండె జబ్బులను ఎలా నివారించుకోవాలి
క్రమంగా హృదయపరీక్షలు చేయించుకోవాలి,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి,రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా హృద్రోగాన్ని నివారించవచ్చు,ధూమపానం, మద్యపానం తగ్గించాలి,శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.ఆహార నియంత్రణ – కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచండి.నిత్యం వ్యాయామం చేయండి – రోజుకు కనీసం 30 నిమిషాలు.ధూమపానం, మద్యం వీలైనంత వరకు మానుకోండి.స్ట్రెస్ తగ్గించుకోండి – మెదడుకు విశ్రాంతి అవసరం.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.