తన పిల్లలు భారత్ లో పెరిగితే నైపుణ్యాలు వస్తాయి అంటున్న విదేశీయురాలు

Kristen Fisher: తన పిల్లలు భారత్ లో పెరిగితే నైపుణ్యాలు వస్తాయి అంటున్న విదేశీయురాలు

ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతోమంది భారతీయ యువతీ యువకులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటుంటారు. అమెరికా వెళ్లేందుకు అనేక వ్యయప్రయాసలు పడుతుంటారు. కొందరైతే అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి గెంటివేయబడుతున్నారు.
భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తించిన క్రిస్టెన్ ఫిషర్
ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండగా, అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పిల్లలు భారత్‌లోనే పెరగాలని కోరుకోవడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తేలా కీర్తించడం విశేషం. తన పిల్లలను భారత్‌లో ఎందుకు చదివించాలని భావిస్తుందో వివరిస్తూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisements
తన పిల్లలు భారత్ లో పెరిగితే  నైపుణ్యాలు వస్తాయి అంటున్న విదేశీయురాలు

నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో నివాసం
స్కైఫిష్ డెవలప్‌మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉంటోంది. తన పిల్లలు భారతదేశంలో పెరిగితే ప్రయోజకులు అవుతారంటూ ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లో గడిస్తే ఎందుకు మంచిగా ఉంటుందో కూడా ఆమె వివరించింది.
బలమైన సన్నిహిత సంబంధాలు వుంటాయి
భారత్‌లో నివసిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారని, దానివల్ల సామాజిక నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు సానుభూతిగా వ్యవహరించడం తెలుస్తుందన్నారు. అలానే భారతీయ కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయని, తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుందని, ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుందన్నారు. ఈ వాతావరణంలో పెరిగితే అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మంచి కేరీర్‌కు
పరిస్థితులకు అనుగుణంగా జీవించడం, సర్దుకుపోవడం వంటివి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు ఇక్కడ స్నేహితులు అవుతారని, ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కేరీర్‌కు దోహదపడతాయన్నారు.

Related Posts
Elon Musk : స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి
స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి

టెస్లా అధినేత ఎలోన్ మస్క్ స్టార్ లింక్ త్వరలో ఇండియాలోకి రానుంది. అయితే ఇప్పటికే దీనిపై చాలా దుమారం రేగుతుంది. ఏంటంటే స్టార్ లింక్ కార్యకలాపాలను ప్రారంభించే Read more

రష్యా ఉక్రెయిన్ పై తీవ్ర దాడులు: పుతిన్ హెచ్చరిక
తొలిసారిగా యుద్ధ భూమిలోకి వెళ్లిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవంబర్ 28, 2024న ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తన తీవ్ర హెచ్చరికను ప్రకటించారు. ఉక్రెయిన్‌కు చెందిన "డెసిషన్ -మేకింగ్ సెంటర్స్"ని Read more

డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌ పై ఎఫెక్ట్‌
Suspension of USAID.. Effect on India

న్యూయార్క్‌: ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యూఎస్‌ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ భారత్‌పై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×