Falcon 9 rocket lifts off into space.. Sunita Williams to return to Earth soon!

Sunita Williams: నింగిలోకి ఫాల్కన్‌ 9 రాకెట్‌.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్!

Sunita Williams: అంతరిక్షకేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమ్మీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు తాజాగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది.

Advertisements
సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్

వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు

దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే ఉంటున్న విషయం తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్‌ ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్‌ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ వ్యోమగాములు ఉన్నారు.

దాదాపు తొమ్మిది నెలల తర్వాత

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్‌లు చేరుకున్నారు. స్టార్‌లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరింది. దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాల దాదాపు తొమ్మిది నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు పంపించారు.

Related Posts
తిరుపతికి పవన్ కళ్యాణ్
pawan tirupathi

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి ఆయన ఈ పర్యటన Read more

సొంతపార్టీ నేతలే డీకే శివకుమార్‌పై విమర్శలు
DKSHIVA

డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన Read more

Fever : ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…?
boday pains

వారం రోజులుగా చాలామంది తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురవుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటితో Read more

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత
BJP stalwart LK Advani's he

బీజేపీ సీనియర్ నేత మరియు భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 97 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన, ఢిల్లీలోని అపోలో Read more

Advertisements
×