Every Saturday will now be 'No Bag Day' in AP

AP schools : ఏపీలో ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’

AP schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. అయితే ఇకపై ప్రతీ శనివారం కూడా నో బ్యాగ్ డే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న నారా లోకేష్.. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తామని ప్రకటించారు. నో బ్యాగే డే అయిన శనివారం రోజున విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు.

Advertisements
ఏపీలో ఇకపై ప్రతి శనివారం

విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యా శక్తి పేరుతో ఓ కార్యక్రమం అమలుచేస్తోంది. విద్యాశక్తి కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సహకారంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపడుతోంది. తొలి విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

Related Posts
జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!
జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి Read more

91 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు – కూటమి ప్రభుత్వం
deepam schem

"దీపం-2" పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పేద కుటుంబాల గృహిణులకు గ్యాస్ కనెక్షన్లను అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా Read more

Inter : ఇంటర్ విద్యార్థులకు APSRTC గుడ్‌న్యూస్
ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025–26 విద్యా సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా Read more

మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్
Former Prime Minister of Mauritius Pravind Jugnauth arrested

ఆయన హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తింపు పోర్ట్ లూయిస్ : మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యారు. ఆయన నివాసంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×