Every Saturday will now be 'No Bag Day' in AP

AP schools : ఏపీలో ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’

AP schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. అయితే ఇకపై ప్రతీ శనివారం కూడా నో బ్యాగ్ డే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న నారా లోకేష్.. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తామని ప్రకటించారు. నో బ్యాగే డే అయిన శనివారం రోజున విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు.

Advertisements
ఏపీలో ఇకపై ప్రతి శనివారం

విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యా శక్తి పేరుతో ఓ కార్యక్రమం అమలుచేస్తోంది. విద్యాశక్తి కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సహకారంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపడుతోంది. తొలి విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

Related Posts
Vijay Sethupathi: విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా
Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! విజయ్ సేతుపతితో కొత్త సినిమా

హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల కోసం ఎదురు చూసే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన టేకింగ్, పవర్‌ఫుల్ మాస్ Read more

Agneeshwar Sen: అమెరికా ,చైనాకు సుంకాల దెబ్బ..భారత్ కు ఫేవర్
Agneeshwar Sen అమెరికా ,చైనాకు సుంకాల దెబ్బ భారత్ కు ఫేవర్

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కింది. అమెరికా సుంకాల దెబ్బ చైనాకు గట్టిగా తగులుతోంది. దీనివల్ల భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాలు వస్తున్నాయని మార్కెట్ నిపుణులు Read more

Results: ఇంటర్‌, పదో తరగతి ఫలితాల విడుదలపై కీలక ప్రకటన!
Results: ఈ నెల 24 న ఇంటర్ ఫలితాలు మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల

ఫలితాల ప్రకటనకు సమయం ఖరారు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదలకు ప్రభుత్వం కీలక తేదీని ఖరారు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం, ఈ నెల 24వ Read more

Tariffs : వివిధ దేశాలపై ప్ర‌తీకార సుంకాల‌ను ప్ర‌క‌టించిన డొనాల్డ్‌ ట్రంప్
అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×