KTR meets former Governor Narasimhan in Chennai

KTR : చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

Advertisements
చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా

కాగా, కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ నిలిచారు.

దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది

కాగా, చెన్నైలో నిర్వ‌హించిన డీలిమిటేష‌న్ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని.. డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు.

Related Posts
TG Assembly: సీఎం స్పీచ్‌ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLAs walk out CM speech

TG Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం Read more

ఎన్నారై భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శన అవకాశం!
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్థానిక మరియు ప్రవాస భారతీయ (NRI) భక్తులకు శుభవార్త ప్రకటించింది. ఫిబ్రవరి 11న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోరుకునే Read more

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం..ఎక్కడివో తెలుసా..?
Rs.20 lakhs is available in

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కాకపోతే ఇదంతా కూడా దొంగసొమ్ము అని తేలింది. ఒడిశాకు చెందిన ఓ Read more

CBG Plant: నేడు ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటుకు శంకుస్థాపన
Foundation stone laid for CBG plant in Prakasam district today

CBG Plant: ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంటుకు మంత్రి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×