NTR Dragon : తారక్ గాయం.. డ్రాగన్ 2028కి షిఫ్ట్..?

Follow Us: Google News Daily Hunt
NTR Dragon : తారక్ గాయం.. డ్రాగన్ 2028కి షిఫ్ట్..?
FONT SIZE
GET APP

NTR Dragon : యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (NTR Dragon)పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తారక్‌కు గాయమవ్వడం షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం చూపిస్తోంది.

Read Also : విజయ్ సేతుపతి స్పూర్తితో రవితేజ..?

ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో :

ఇటీవల షూటింగ్‌లో ఉండగా ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం తారక్ రికవరీ, రిహాబిలిటేషన్‌పై దృష్టి పెట్టనున్నారు. సాధారణ కార్యకలాపాలకు పూర్తిగా తిరిగి రావడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని ఆసుపత్రి తాజా ప్రకటనలో తెలిపింది.

NTR Dragon
Jr NTR Dragon Movie

ఈ గాయం కారణంగా ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే తారక్ పాల్గొనాల్సిన కీలక సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉండటంతో ఆయన తిరిగి సెట్స్‌లోకి వచ్చే వరకు కొన్ని ముఖ్యమైన భాగాల చిత్రీకరణ ముందుకు సాగడం కష్టమేనని టాక్. అసలు ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా పరిణామాలతో ఆ తేదీకి సినిమా సిద్ధమవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.

తారక్ రికవరీ, షూటింగ్ పూర్తయ్యే సమయం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను బట్టి విడుదల తేదీలో మార్పు రావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే 2027 చివర్లో లేదా 2028లో ‘డ్రాగన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. అయితే 2028 విడుదలపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అభిమానుల ఆశ మాత్రం ఒక్కటే.. తారక్ పూర్తిగా కోలుకుని త్వరగా షూటింగ్‌లోకి రావాలని, సినిమా అనుకున్న స్థాయిలో పూర్తి చేసి భారీ విజువల్ ట్రీట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Ramesh

రచయిత గురించి

Ramesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు