People Star : సామాన్య ప్రజల జీవితాలు, సామాజిక సమస్యలు, కార్మికులు, రైతుల కష్టాలను తన సినిమాల ద్వారా తెరపై ఆవిష్కరించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా తన రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విప్లవాత్మక, సామాజిక సందేశాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ‘హుషారు-2’ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా విడుదలైన టీజర్‌లో నారాయణమూర్తి కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఆయన చెప్పిన ‘తమ్ముళ్లూ.. వేట మొదలెడదమా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆయన కొత్త పాత్రలో ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Read ALso : రామాయణం పాటలపై ట్రోలింగ్.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని ఆర్. నారాయణమూర్తి స్పష్టం చేశారు. గతంలో ‘టెంపర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ‘హుషారు-2’ వంటి కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనదైన అభినయంతో సామాజిక అంశాలను బలంగా చెప్పే నారాయణమూర్తి, ఈసారి భిన్నమైన పాత్రలో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి. ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు, కథల విషయంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :