‘బేబి’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కావడం, ఆదిత్య హాసన్ దర్శకత్వం, నాగవంశీ నిర్మాణం తోడవడంతో ‘ఎపిక్’ సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో చాలా వరకు విజయం సాధించింది. కన్ఫ్యూజన్‌లో ఉండే యూత్‌కు, తండ్రి నమ్మకానికి మధ్య జరిగే అంతర్మథనాన్ని దర్శకుడు తెరపై ఎంతో ఆసక్తికరంగా మలిచారు. సినిమా ఆరంభంలోనే కథలోకి తీసుకెళ్లడం, లండన్ నేపథ్యంలో ఆనంద్ (ఆదిత్య), వైష్ణవి (కడలి)ల మధ్య కెమిస్ట్రీ, వారి రూమ్‌మేట్ ప్రయాణంలో వచ్చే కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రథమార్థం సరదాగా, వేగంగా సాగిపోతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
Read Also : మహేంద్రగిరి వారాహి ట్విట్టర్ రివ్యూ

భావోద్వేగాల మేళవింపుతో ఆకట్టుకునే ద్వితీయార్థం
కేవలం లవ్ అండ్ రొమాన్స్ మాత్రమే కాకుండా, కథలో అంతర్లీనంగా ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు అసలైన ప్రాణంగా నిలిచాయి. నటుడు శివాజీ తన స్థోమతకు మించి కొడుకును చదివించే సగటు మిడిల్ క్లాస్ తండ్రి “చంద్ర శేఖర్” పాత్రలో ఒదిగిపోయారు. ద్వితీయార్థంలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, బాధ్యతలకు-లక్ష్యానికి మధ్య హీరో పడే తపన ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టిస్తాయి. వైష్ణవి తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, ఆనంద్ దేవరకొండ ఇటు కామెడీని, అటు ఎమోషన్స్‌ను సమర్థవంతంగా పండించారు. పాటలు, నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను మరింత పెంచాయి. మొత్తానికి లవ్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్స్ సరైన పాళ్లలో కుదిరిన ‘ఎపిక్’ యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే మంచి ఎమోషనల్ డ్రామాగా నిలిచింది.
వార్త రేటింగ్ : 3/5
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :