Andrea Jeremiah: తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘యుగానికి ఒక్కడు’ (Aayirathil Oruvan) సీక్వెల్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ, నటి ఆండ్రియా జెర్మియా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అయితే, దీని సీక్వెల్‌లో నటించే ప్రసక్తే లేదని ఆండ్రియా తెగేసి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Read Also: Actress Hema Latest News: “మీ హేమక్క తప్పు చేయదు”.. నటి హేమ
చోళుల చరిత్ర – ఒక సాహసయాత్ర
2010లో విడుదలైన ‘యుగానికి ఒక్కడు’ సినిమా కార్తీ, ఆండ్రియా, రీమా సేన్ కెరీర్‌లలో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రానికి భారీ ఆదరణ లభించింది. అడవులు, ఎడారుల నేపథ్యంలో సాగే ఈ ఫాంటసీ అడ్వెంచర్ కోసం నటీనటులు సుమారు 200 రోజులకు పైగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశారు.

Andrea Jeremiah: ఆండ్రియా ఆవేదన.. ఎందుకీ నిర్ణయం?
చాలా కాలంగా ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2021లో సెల్వరాఘవన్, ధనుష్‌తో కలిసి ‘యుగానికి ఒక్కడు-2’ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించడంపై ఆండ్రియాను సంప్రదించగా, ఆమె నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడమే కాకుండా కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు:
“ఆయన (సెల్వరాఘవన్) చెప్పే టైమింగ్‌కు, సెట్‌లో చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. షూటింగ్ సమయంలో నేను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం.”సినిమా హిట్ అవ్వడం వల్ల అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే అయినా, ఆ సమయంలో అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని తాను మర్చిపోలేనని ఆమె స్పష్టం చేశారు.”మళ్ళీ ఆయనతో సినిమా చేయడం నా వల్ల కాదు.. అది జరిగే పనే కాదు” అంటూ సెల్వరాఘవన్ దర్శకత్వంలో పని చేసేందుకు ఆండ్రియా సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: