World population : జనాభా కాదు… జనశక్తిని నిర్మించాలి

Follow Us: Google News Daily Hunt
World population
World population
FONT SIZE
GET APP

World population : భారత్ అభివృద్ధి భవిష్యత్తు జనాభా పరిమాణంపై కాదు, యువతకు విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, ఉపాధి, స్వేచ్ఛ కల్పించడంపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చినప్పుడల్లా మన చర్చ ఇప్పటికీ జనాభా ఎంత పెరిగింది?” అనే ప్రశ్న చుట్టూనే తిరుగు తోంది. కానీ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆసలు ప్రశ్న అది కాదు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి 2026 ప్రపంచ జనాభా దినోత్సవానికి ప్రకటించిన ‘రిలైజింగ్ ద హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ద ఫ్యూచర్’ అనే థీమ్ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తోంది. జనాభా ఎంత ఉందన్నది కాదు ఆ జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత చదువుకుంది. ఎంత నైపు ణ్యం సంపాదించింది. ఎంత స్వేచ్చగా తన జీవితాన్ని నిర్మించుకో గలుగుతోంది అనేదే దేశ భవిష్యత్తును నిర్ణ యించే అంశంగా మారింది. ఒకప్పుడు జనాభా పెరుగుద లనే అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.

Read Also : Breaking News : ఫు క్వోక్ ద్వీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా

World population
World population

World population : యువ జనాభా కలిగిన దేశం

ఐక్యరాజ్యసమితి లెక్కలప్రకారం అనేక దేశాలు వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జననాల రేటు, కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పాటు, అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశంగా భారత్కు ఒక చారిత్రక అవకాశం లభించింది. అయితే ఈ అవకాశా న్ని నిజమైన జనశక్తిగా మార్చగలుగుతున్నామా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది. ఒక దేశ భవిష త్తును కేవలం జనాభా సంఖ్య నిర్ణయించదు. ఆ జనాభాలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఎంత మంది నాణ్యమైన విద్య పొందుతున్నారు? ఎంతమందికి అవసరమైన నైపుణ్యాలున్నాయి? ఎంతమందికి గౌరవప్రద మైన ఉపాధి లభిస్తోంది? అన్నదే దేశ పురోగతిని నిర్ణయి స్తుంది. యువశక్తికి నాణ్యమైన విద్య, సరైన శిక్షణ, మెరు గైన ఆరోగ్యం, తగిన ఉపాధి అవకాశాలు కల్పించకపోతే అదే జనాభా నిరుద్యోగం, అసమానత, సామాజిక అసం తృప్తికి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే జనాభా సంఖ్య కంటే మానవ వనరుల నాణ్యతపై పెట్టు బడి పెట్టడం అత్యవసరమైంది. విద్యారంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది.

World population
World population

అవకాశాలను కల్పించిన ప్పుడే ..

యుడిఐఎస్ఇ 2023-24 గణాంకాల ప్రకారం పాఠశాల స్థాయిలో బాలికల నమోదు అబ్బాయిలతో దాదాపు సమాన స్థాయికి చేరుకుంది. కానీ ఈ గణాంకాలు మరో ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నాయి. చదువు పూర్తయిన ప్రతి యువకుడు, యువతి ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారా? పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు వారికి అందుతున్నాయా? మారు తున్న సాంకేతిక ప్రపంచానికి తగిన సామర్థ్యాలను విద్యా వ్యవస్థ పెంపొందిస్తోందా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత విద్య పూర్తిచేసి ఉద్యోగ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. కానీ వారందరికీ వారి నైపుణ్యా లకు తగిన ఉపాధి లభిస్తోందా? అనేది కీలకమైన ప్రశ్న. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం మ హిళల శ్రామిక భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ, ఆ పెరుగుదలలో గణనీయమైన భాగం స్వయం ఉపాధి లేదా అనౌపచారిక రంగంలోనే ఉంది. మరోవైపు యువత నిరు ద్యోగం, నైపుణ్యాలకు తగ్గఉద్యోగాల కొరత ఇంకా సవాళ్లు గానే ఉన్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం మనకు గుర్తు చేయాల్సిన సందేశం ఒక్కటే. జనాభా సంఖ్యను లెక్కించడం కంటే, ప్రతి మనిషిలోని సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా ముఖ్యం. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలు, గౌరవ ప్రదమైన ఉపాధి, లింగ సమానత్వం, నిర్ణయ స్వేచ్ఛ ఇవే భవిష్యత్ భారతాన్ని నిర్మించే అసలు పునాదులు. ప్రతి యువకుడికి, ప్రతి యువతికి తమ సామర్థ్యాన్ని వికసింప జేసుకునే అవకాశాలను కల్పించిన ప్పుడే జనాభా నిజమైన జనశక్తిగా మారుతుంది.

-వంగవోలు రవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు