Vande Mataram : ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ త్రేతా యుగం నాటి శ్రీమద్రామాయణంలోని తల్లి మాతృ భూమి గురించిన ప్రశంస ప్రస్తుత కలియుగ భారతా వనిలో జనని, జన్మభూమిగా మాతృభూమి, బానిస శృంఖలాలు ఛేదించే స్వాతంత్ర్యోద్యమసమరంలో ‘వందే మాతరం’ అయింది. వందేమాతరం అంటే “తల్లీ! నీకు ప్రణామం” ఆధర్వణ వేదంలోని పృథివీ సూక్తంలో అభి వర్ణించారు రుషిపుంగవులు. ఆ ప్రాచీన పవిత్ర భావన మరింత 1 ప్రగాఢమై దేశమాత ఆవిర్భవించింది. దేవీదేవతలు ఆరాధనలోంచి దేశమాత జనించింది. వందేమాతరం జప మంత్రంగా దేశభక్తి నినాదమైంది. వందేమాతరం, మాతృ భూమి పట్ల ఆధ్యాత్మిక శక్తిని ఉద్భవింపచేసే రణతంత్రం పని అయింది. జన్మయిచ్చిన భూమి పట్ల అనన్య భక్తి నిర్మింప చేసింది. బెంగాల్ సమర యోధులు, మేధావులకు పుట్టిల్లు బంకించంద్రఛటర్జీ, వైభవాన్వితమైన మాతృభూమికి స్వేచ్ఛా, విముక్తి సాధనకు దేశభక్తి రగిలించాలంటే, దైవ భక్తిలోంచి దేశభక్తి స్ఫూరింపచేసే ఆనందమఠం నవలగా రచించారు. స్వరూపాలుగా జగద్ధాత్రి, కాళి ఉగ్రరూపాలతో పాటూ భారతావనని దివ్యమంగళ స్వరూపంగా అభి వర్ణించి, సంతాన తెగకు చెందిన సన్యాసుల వి స్వాతంత్య్ర దీక్షాలక్ష్యం ఆ నవలలో విపులీకరించబడింది.
Read Also : Onam 2026: ఓనం పండుగ వెనుక ఉన్న కథ ఇదే

Vande Mataram : ఆనందమఠంలో రహస్యం
దేశభక్తులైన సంతానులు, సన్యాసులు దట్టమైన కీకారణ్యంలో శిథిల దుర్గం అయిన ఆనందమఠంలో రహస్యంగా నివసిస్తుం టారు. ఘోర కరవు కాటకాల కారణంగా నాటి జమీం దార్ మహేంద్ర సింగ్ కుటుంబం అడవులపాలై విడిపో తారు. భార్య కల్యాణి దోపిడీ దొంగల బారి నుండి తప్పించుకుని ఆనందమఠంలో ఆశ్రయం పొందుతుంది. సత్యానంత అదే శాలనుసారం భావానంద మహేంద్రసింగ్ ను అరణ్యంలో వెతుకుతుంటాడు. ఇంతలో యాభై మంది సాయుధ సిపాయి దళం, ఆంగ్లేయ సైనికాధికారి కమాండర్గా కంపెనీ ఆదాయ నిధులు కోల్కత్తా అరణ్య మార్గంలో తీసుకుని వెళ్తుంటారు.. దేశభక్తులైన సన్యాసులు జీవానంద నాయకునిగా ఆ నిధిని దోపిడీతో కొల్లగొట్టారు. ఆంగ్ల సైనికాధికారిని సంహరించి, సిపాయిలను పరాజితు లు చేసి లూటీ చేస్తారు. శత్రుసంహారం, లూటీ దోపిడీ దేశభక్తులైన సంతా నులు నేరాలుగా పరిగణించరు. మహేంద్ర, భావానందలు సిపాయిల నిర్బంధానికి గురి అయి తప్పించుకుని ఆనంద మఠంవైపు వెళ్తుండగా, సన్యా సుల లూటీ, దోపిడీ, దౌర్జన్యాలను మహేంద్ర విమర్శిస్తాడు. అప్పుడు భావానంద ఆకాలంలో రాజ్యమేలుతున్న అణచివేత, నిరంకుశ పాలన, ఆరాచకం, దారిద్య్ర స్థితిగతు ల నుండి నాటి పాలనాధికారి, నవాబు రక్షణ కల్పించలే నందున అసమర్థునికిహక్కులేదని, అందువలన లూటీ దోపిడీ న్యాయమైన చర్యలని సమర్థిస్తాడు.
నవలలో వందేమాతరం గీతం యధాతథం
భావోద్రేక భక్తి ఉద్విగ్న తన్మయత్వంతో కవి బంకించంద్రుడు దేశమాత మాతృభూమి స్వర్గతుల్యమని సుజలం, సుఫలం మలయ శీతలమైన దేవీ మాతృస్వరూపాన్ని వందేమాతరంగా గానం చేస్తాడు. 1875 నవం బరులో గేయరూపంలో ఆవిర్భవించిన వందేమాతరం, ఆయన సంపాదకత్వంలో ప్రచురితమయ్యే ‘బంగదర్శన్’ పత్రికలో ప్రచురింపబడింది. బంగదర్శన్ పత్రిక 1880- 1881 మధ్యకాలంలో ఆనంద మళ్ నవలనుధారావాహికగా ప్రచురించింది. ఆ నవలలో వందేమాతరం గీతం యధాత థంగా పొందుపరచబడింది. 1876లో యదునాథ భట్టాచార్య అనే కవి ఈ గీతం మల్లార్రాగంలో పాడారు. 1882లో ఆనందమఠం నవల A పుస్తకంగా ప్రచురితమైంది. 1872-1875 మధ్య రాత ప్రతిగా ఉందని చరిత్ర భావి స్తోంది. 1885 జాతీయ కాంగ్రెస్ కోల్కత్తా సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ దేశిరాగంలో స్వరబద్ధం చేసి స్వయంగా పాడి క్రో తలను ముగ్ధులు చేశారు. జాతీయ కాంగ్రెస్ మహాసభలలో వందేమాతరం పాడటం అప్పటి నుంచే ప్రారంభ మైంది. 1836జూన్ 26న జన్మించిన బంకించంద్ర ఛటర్జీ 1894 ఏప్రిల్ 8న స్వర్గస్థుడైనాడు. 58 ఏళ్లు A జీవించిన మహాదార్శనిక అక్షర శిల్పి తన 44 యేటా ఈ గేయం రచించారు. ప్రప్రథమంగా భారత జాతీయ పితామహుడు దాదాభాయననౌరోజీ సమక్షంలో జాతీయ కాంగ్రెస్ ద్వితీయ మహాసభలో 450 మంది ప్రతినిధులు, ఈదేశ భక్తాగేయం ఆలపించి ఉత్తేజితుల య్యారు.

మొదటి రెండు చరణాలు మాత్రమే ..
1905 నాటికి కాశీ భారత జాతీయ కాంగ్రెస్లో గోపాలకృష్ణగోఖలే సూచనపై రవీంద్రు ని మేనకోడలు సరళా దేవి చౌదురాణి ఈ గేయాన్ని ఆల పించారు. బాలగంగాధర స్త్రీ తిలక్ మాటలలో చెప్పాలంటే భారత జాతీయ పునరుజ్జీ వానికి, వందేమాతరం ఒక మంత్రనాదం. నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా వందే మాతరం సంప్రదాయసొసైటీ అధ్యక్షునిగా కోల్కత్తా నగర వీధులలో మానవేంద్రనాథ్ రాయ్ మార్చింగ్ సాంగ్గా నిర్వర్తించేవారు. 23చరణాలున్న వందేమాతరం, మొదటి రెండు స్టాంజాలు మాత్రమే మాతృదేశభక్తికి సంబంధించి నవిగా గుర్తించబడుతున్నాయి. 7 పాదాల తొలి స్టాంజాలే గుర్తింపు పొందాయి. 150 వసంతాల తర్వాత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు 2026 వందేమాతరం బిల్లుగా తెచ్చింది. మొత్తం 6 చరణాల భాగాల సంపూర్ణ గేయం లోని మొదటి రెండు చరణాలు మాత్రమే 1950 జనవరి 24 భారత రాజ్యాంగ సభ అధికారిక ఆమోదయోగ్యంగా సుమారు 76 సంవత్స రాలకు పైగా మాతృదేశాన్ని తల్లిగా వందేమాతరం పొడి పూజిస్తున్నాం. ఇప్పుడు ఎందుకే అనర్ద రాద్ధాంతం?
-జయసూర్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: