US-Iran War : శాంతి ముణ్ణాళ్ల ముచ్చటేనా?

Follow Us: Google News Daily Hunt
America-Iran War
America-Iran War
FONT SIZE
GET APP

US-Iran War : అమెరికా ఇరాన్ల మధ్య మళ్లీ భీకర యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఉభయదేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి చెల్లుచీటీ పడినట్లే. ఇరాన్పైఅమెరికా తాజాగా చేపట్టిన సైనిక చర్యతో ఇరాన్ సైనిక, అణు సామర్థ్యాలను నిర్వీర్యం చేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంబరపడి పోతున్నట్లే ఉంది. ఆయన ఏమి మాట్లాడినా అది సంచలనమే. అయితే అందులో గాసిప్ ఎంత ఉందో వైరిపక్షం వారు తేల్చేవరకు అంతే. టర్కీ రాజధాని అంకారాలో ‘నాటో’ సదస్సు అనంతరం మాట్లాడుతున్నప్పుడు ఇరాన్కు ఎలాంటి సైన్యం కానీ, వైమానిక దళం కానీ మిగలలేదని, 159నౌకలు సముద్ర గర్భలో కలిసి పోయాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వం ఇక ఎన్నటికీ అణ్వాయుధాన్ని తయారుచేయలేదని అన్న ఆయన మాటలే నిజమైతే ఇరాన్, ఆ మెరికాల మధ్య ద్వేష, శత్రు సంబంధాలే ఉండవని తేటతెల్లమై నట్లే కదా! ఇక వైరం కథ కంచికేనని అనుకోవాలి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. హర్మూజ్ జల సంధిలో ఈ దుర్ఘటనలు అంతర్జాతీయ నౌకలకు ఎంతో ముప్పుగా పరిణమించాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. భవిష్యత్లో చర్చలుండవు. సంప్రదింపులు మాత్రమే అనికూడా ట్రంప్ ప్రవచిం చారు. ఎప్పుడో ఓసారి ఇలాంటి విషయాలను వింటే ఇదే ఫైనల్ అను కోవడం సహజం. కానీ ట్రంప్ ఉదయం ఓ మాట, సాయంత్రం ఓ పలుకు వల్లె వేయడం వలన సీరియస్గా యుద్ధం జరుగుతున్నవేళ వాటికి విలువ లేకుండాపోయింది.

Read Also: Iran Plan Kill To Trump : ట్రంప్​ను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర- ఇజ్రాయెల్​ హెచ్చరిక

US-Iran War
US-Iran War

US-Iran War : ట్రంప్ తన హోదాను మరిచి ..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఒడిదుడుకులు ఎదు ర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ట్రంప్ తన హోదాను మరిచి వాచాలత ప్రదర్శించడాన్ని ఏ దేశమూ హర్షించడం లేదు. అదేఇప్పుడు ప్రపంచ దేశాలను సంక్షోభంలో ముంచుతోంది. ఆయన మాటలకు నాటో అరబేశాలు ఖాతరు చేయడంలేదు. తాజాగా అమెరికా, ఇరాన్ యుద్ధ ఘర్షణలో ఇటలీలోని తమ సైనిక స్థావ రాలను భాగస్వా మ్యం చేయబోమని ‘నాటో’ వేదికగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని స్పష్టంచేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తగ్గించే ప్రయత్నానికి బదులు వత్తాసు పలకడం విష యంలో ఔచిత్యం లేదు. తమతో కలిసిరాని స్పెయిన్ వంటి దేశాలతో అమెరికా ఏకపక్షంగా ట్రేడీడీలు ఉపసంహరించుకుంది. ఇరాన్పై భీకర దాడులకు సహకరించాలని ఆయా దేశాల మెడపై ట్రంప్ కత్తివేలాడుతోంది. యుద్ధశాంతులలో తనదే పైచేయి అనిచెప్పుకున్న ఆయన ఇరాన్ను సర్వనాశనం చేయాలని సంకల్పం చెప్పుకున్నట్లుగానే ఉంది. ఇరాన్ ప్రపంచ చిత్రపటంలో కనిపించదు. ఇరాన్ను అణ్వా యుధరహిత దేశం స్థాయికి పడకొట్టేశామని చెప్పుకున్న ట్రంప్ ఇంకా దాడులు ఎందుకు కొనసాగిస్తున్నారో ఎవరూ జవాబు చెప్పలేని ప్రశ్న.

చాలా దేశాలు ఆర్థికంగా బలహీనపడ్డాయి

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోసారి ప్రపంచ దేశాలను గందరగోళంలోకి నెట్టే అసందర్భ ప్రేలాపన లకు, యుద్ధ నిర్ణయాలకు పర్యవసానాలకు శ్వేత సౌధా ధినేత జవాబు చెప్పాలి. ‘నాసైన్యం- నా ఇష్టం’ అంటే కుద రదు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా దాడులు ప్రతిదాడులు తర్వాత చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడిన రీత్యా బ్రెంట్ క్రూడ్ ధరలు పెరి గాయి. శాంతి ఒప్పందం కూడా ప్రశాంతంగా జరుగ లేదు. ఇరాన్ను బెదిరించి లొంగదీసుకోవాలన్న అమెరికా ఆశలు అడియాసలే అయ్యాయి. తీరా ఆరునెలల తాత్కా లిక ఒప్పందం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. అమెరికా గొంతెమ్మ షరతులు కారణంగానే ఇరాన్ లొంగినట్లు సయోధ్యకొచ్చినా ట్రంప్ వాచాలత వారిని పూర్తిస్థాయి శాశ్వత ఒప్పందం దిశగా పయనించనీయలేదు. తుర్కి యేలో నాటో సదస్సు పూర్తయ్యాక ట్రంప్ మాట్లాడిన మాటలేవీ వినసొంపుగా లేదు. ఇరాన్పై దాడులు కొన సాగుతున్నట్లు చెప్పడం అదొక టెంపరితనమే. ఇప్పటికీ చాలా దేశాలు ట్రంప్ అనౌచిత వైఖరి వలలో ఆర్థికంగా బలహీనపడ్డాయి. ఇప్పటికిప్పుడు శాశ్వత మైత్రీ సంబం ధాలు ఏర్పడినా గత యుద్ధపు నాటి పర్యవసానాలు ఫలితాలను తట్టుకుని వెంటనే నిలదొక్కుకునే పరిస్థితి ఏ దేశానికీ లేదు. మళ్లీ ఇప్పటి ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఏపరిస్థితికి తీసుకెళ్తుందోనని అన్నిదేశాలు ఆందోళన పడుతున్నాయి.

US-Iran War
US-Iran War

శాంతి దిశగా సన్నద్ధం చేయడమొక్కటే శరణ్యం

ఇప్పటికే స్టాక్ మార్కెట్ల కుదేలయ్యా యి. తాత్కాలిక ఒప్పందం వీగిపోయింది. కాల్పుల విరమణకు తెరపడిం దన్న ట్రంప్ వాక్యాలు అంతర్జాతీయ చమురు మార్కెట్ పై ప్రభావం చూపాయి. ఆరుశాతం చమురు ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. ఇరాన్లో తమ దాడులకు వీలున్న లక్ష్యాలన్నిటినీ ఏకరువు పెట్టి మరీ ట్రంప్ ఆదేశాన్ని హెచ్చరిస్తున్నారు. ఖమెనీ అంత్యక్రియలు ప్రారంభమైన వేళ తానే కనుక దయ చూపకపోతే ఆ అంత్యక్రియల సందర్భంగా బాంబులేసి ఇరాన్ పెద్ద తలకాయలను ఒక్కసారిగా లేపేసే వాడిననే ట్రంప్ చెప్పుకోవడం కూడా ఆ దేశం ఆగ్రహానికి కారణమైంది. ఇరాన్ను పూర్తిగా నాశనం చేశామని చెప్తూనే ‘ఖర్గ్ ద్వీపం’ దాడుల విషయం ప్రస్తావిం చడం కూడా ఇరాన్ కోపానికి కారణమే. అమెరికా సైన్యం ఇరాన్ భూ భాగంపై బుధవారం రాత్రి చేసిన భీకరమైన వైమానిక దాడులు బాగా కల్లోల పరుస్తున్నాయి. ఈ దాడుల్లో భారతదేశ భాగస్వామ్యం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన చబహార్ నౌకాశ్రయం అమెరికా క్షిపణులు ఒక్కసారిగా విరుచుకు పడడంతో భారీగా దెబ్బతిందన్న సమాచారం ఆందోళ నకరమే. దెబ్బతిన్న దేశాల సైతం ఉభయ యుద్ధ భాగస్వామ్య మున్న దేశాలను శాంతి దిశగా సన్నద్ధం చేయడమొక్కటే శరణ్యం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు