Tiger : పులుల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమౌతుందనే పర్యావరణ వేత్తల అభిప్రాయాన్ని గౌరవిస్తూ మన దేశంలో పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తుండడం అభినంద నీయం. స్వతంత్ర భారతంలో తొలి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో పులుల సంఖ్య గణనీయం గాతగ్గి పులి సంతతి దేశంలో అంత స్థానమోతుందేమోననే భయం మొద లైంది. పర్యవసానంగా పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. తద్వారా పులుల సంరక్షణలో మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఇది బహిరంగ రహస్యం. మొదట 9 రిజర్వ్ లు, 18,278 చ.కి.మీ.ల నుండి నేడు 58 రిజర్లు, 84, 488 చ.కి.మీ.కు పెరిగింది. ఇది దేశ భూభాగంలో 2.6 కావడం గమనార్హం. రిజర్వ్ ఫారెస్ట్‌ల ఏర్పాటు, ఆదివాసీల తోడ్పాటు, సుశిక్షితులైన అటవీ అధికారుల స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వం, క్షేత్ర స్థాయి అటవీశాఖ సిబ్బంది త్యాగాల ఫలితంగా 2006లో 1,411గా ఉన్న పులులసంఖ్య 2022 లో 3,682కి పెరిగింది. ప్రపంచ పులుల్లో 75 భారత్‌లోనే ఉన్నాయి. ఈ అద్భుతమైన విజయగాథ చిరస్మరణీయమే. రిజర్వ్ ఆడవులలో పెరుగుతున్న పులులు ఇరుకుగా మారిన వాటి ఆవాసాలలో ఇమడలేక రిజర్వ్ అడవుల్లో చోటుచాలక 3540 పులులు ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ బయటకు వలస వె క్లాల్సివస్తోంది.
Read Also : Viral Tiger Video : సెల్ఫీకి మరీ దగ్గరగా: వన్యప్రాణి పర్యాటకంలో పెరుగుతున్న ముప్పు

Tiger : పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి
నూతన ఆవాసాల అన్వేషణలో పులులు గ్రామాలు, పొలాలు, రోడ్లతో కూడిన జనావాసాల వైపు దూసుకువస్తున్నాయి. దీంతో మనిషిపులి ఘర్షణలు పెరుగు తున్నాయి. మనుషుల, పశువుల ప్రాణనష్టం జరుగుతోంది. ఫలితంగా పులుల పట్ల ప్రజల్లో తీవ్రవ్యతిరేకత, భయం పెరిగి వాటిని వేటాడే పరిస్థితులు వస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకతో సహా పలురాష్ట్రాల్లో ప్రజల ఆగ్రహానికి పెద్ద సంఖ్యలో పులులు బలైన వైనం బహిరంగ రహస్యమే. దీనికి తోడు అంతర్జాతీయ విఫణిలో పులి చర్మానికి, గోర్లకు ఉన్న డిమాండ్, ‘ఔషధ గుణాలున్నాయి’ అనే మూఢనమ్మ కాల కారణంగా వేటగాళ్ల ఉచ్చులో పడి రిజర్వ్ అడవుల లోపలే అడపా తడపా పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దుర్భేద్యమైన రిజర్వ్ అడవులలోనే పోచింగ్ సాధ్యమైనప్పుడు రిజర్వ్ అడవుల బయట పులులను పోచింగ్ బెడద నుండి కాపాడడం కష్టంగా మారుతుందని చెప్పక తప్పదు. ఈ సమస్య పరిష్కారానికి 2025 అక్టోబర్ 6న డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో జరిగిన వైల్డ్ లైఫ్ వీక్‌లో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలు సంయుక్తంగా రూ.88.7 కోట్ల బడ్జెట్‌తో మూడు సంవత్సరాల కాలపరిమితితో టిఒటిఆర్ అనే వినూత్న పులుల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారం భించ డం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ బయట కూడా శాస్త్రీయంగా, ల్యాండ్స్కప్ ఆధారితంగా పులులను కాపాడటం. అదే సమ యంలో మనుషుల ప్రాణాలు, జీవనోపాధికి భంగం కలగ కుండా చూడటం, రియాక్టివ్ కాకుండా ప్రో యాక్టివ్, టెక్నాలజీ, ప్రజల భాగస్వామ్యంతో పని చేయడమే దీని స్ఫూర్తి, త్రిముఖ వ్యూహంగా టి.ఓ.టి.ఆర్ పని చేస్తుంది? కమ్యూనికేషన్ సిస్టమ్స్ అప్ గ్రేడ్, త్వరితగతిన స్పందించే రెస్క్యూ టీములు, రెస్క్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం.
పులులు వలసవెళ్లే క్రమంలో..
రిజర్వ్ అడవుల బయట మనుషులు పులులు కలిసి జీవించే పరిస్థితులు సృష్టించడం. అవగాహన కార్యక్రమాలు, నష్టపో యిన వారికి సకాలంలో పరిహారం. ఆలస్యం చేస్తే ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతారు. గ్రామస్తులను భాగస్వా ములుగా చేయాలి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 ప్రకారం 212 ఫారెస్ట్ డివిజన్లలో పులులున్నాయి. వాటిలో మొదటి ఫేజ్ 9 రాష్ట్రాల్లోని 40డివిజన్లను ఎంపిక చేయ డం జరిగింది. అవి ఉత్తరాఖండ్, ఉ త్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, తెలంగాణలు. తెలంగాణాలో కవ్వాల్ టైగర్ రిజర్ను ఎం పిక చేయడం హర్షనీయమే. సమీప గతంలో మహారాష్ట్ర లోని తాడోబా, తిప్పేశ్వర్, ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి నుండి కవ్వాల్కు పులులు వచ్చేందుకు కుమ్రం భీం టైగర్ కన్జర్వే షన్ కారిడార్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక రిజర్వ్ నుండి మరో రిజర్వ్రు పులులు వలసవెళ్లే క్రమంలో అనివా ర్యంగా రిజర్వ్ బయట వాటినంచారం కనిపిస్తోంది. అందుకే రిజర్వ్ బయట వాటి సంరక్షణ కోసమే టి.ఓటి. ఆరు ప్రతిపాదించారు. గతంలో రిజర్వ్ ఫారెస్ట్‌లను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలే నిన్న గాక మొన్న టైగర్ కారిడార్ ప్రాం తాలలో నివసిస్తున్న గిరిజనులను, సమీప ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనేతరులను టైగర్ కారిడార్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టిన వైనం శోచనీయం.
పర్యా వరణ పరిరక్షణ
పులుల సంరక్షణతో పర్యా వరణ పరిరక్షణ, సుస్థిరతతో కూడిన అభివృద్ధి జరుగుతుం దన్న విషయాన్ని పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసమే ఈ ధోరణిని ప్రదర్శించడం దురదృష్టకరమ నేది పులుల సంరక్షణ నిపుణుల నిశ్చితాభిప్రాయం. ఎందు కంటే టైగర్ కారిడార్ మూలంగా పోడుసేద్యం చేసుకుంటు న్న గిరిజనులు, గిరిజనేతరుల ఆవాసాలు చెదిరి వారి మను గడే ప్రమాదంలో పడుతుందని వాదిస్తున్న రాజకీయపార్టీల నేతలు దేశంలో అనేక ఇతరరాష్ట్రాలలో పాలన కొనసాగిస్తున్న తమ పార్టీ ప్రభుత్వాలు అభివృద్ధిసాకుతో లక్షల హెక్టార్ల అటవీ భూములను కార్పొరేట్లకు అప్పణంగా అప్పగిస్తుంటే మౌనంగా ఉండడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమే ననేది పర్యావరణ వేత్తల అభిప్రాయం. ఈ పరిస్థితులలో కొమ్రం భీం టైగర్ కారిడార్‌లో పోయినేడాది ప్రవేశపెట్టిన టి.ఓ. టి.ఆర్కు రాజకీయ పార్టీల నేతలు ఏవిధంగా సహకరిస్తారో వేచిచూడక తప్పదు. మరోవైపు గ్రామాల్లో పులి మ్యానీటర్ గామారింది ‘పులి వస్తే చంపేయాలి’ అనే భయం ఉంది. ఈ భయాన్ని పోగొట్టి ‘పులి ఉంటే అడవి బాగుంటుంది, అడవి తోనే మానవ మనుగడ సుస్ధిరమౌతుందనే అవగాహన ప్రజ లలో కలిగించాలి. టెక్నాలజీ తోడ్పాటు మానవ వనరుల కల్పన గిరిజన భాగస్వామ్యంతో పైలట్ ప్రాజెక్ట్ అమలులో వున్న రాష్ట్రాల్లో కెమెరా ట్రాప్స్, డ్రోన్స్, నిఘా, ముందస్తు హెచ్చరికలతో పాటు శిక్షణ పొందిన అటవీ సిబ్బంది. వెటర్నరీ డాక్టర్లు, రెస్క్యూ టీములు పని చేస్తాయి. బాధితులకు పరిహారం వేగంగా అందించడం కూడా జరుగుతోంది.

‘అముర్ టైగర్’
ఇక్కడ అత్యంత కీలకం ఆదివాసీ భాగస్వామ్యం, శతాబ్దాలుగా అడవి లో బ్రతికే గిరిజనులకు పులి కదలికలు, అడవి రహస్యాలు బాగా తెలుసు. వారిని ‘ఫారెస్ట్ గాడ్స్’ ‘ఈకో గైడ్స్’గా నియ మిస్తే టి.ఒ.టి.ఆర్ 200 సక్సెస్ అవుతుంది. వారిని భాగ స్వాములు చేయకుండా పైనుండి ఉత్తర్వులుఇస్తే ఈ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలను అందించడంలో విఫలమయ్యే ప్రమా దం ఉంది. నేపాల్‌లో బఫరోజోన్ కమ్యూనిటీ ఫారెస్ట్ మో డల్ సక్సెస్ అయ్యింది. అక్కడ స్థానికులకు టూరిజం ఆదా యంలో వాటా ఇచ్చారు. ఫలితంగా వారు స్వచ్ఛందంగా వులులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రష్యాలో ‘అముర్ టైగర్’ కోసం గ్రామాలచుట్టూ ఎర్లీవార్నింగ్ సిస్టమ్ పెట్టారు. మనం కూడా ఇలాంటి మోడల్స్ ని ఆచరణలోకి తెస్తే మరిన్ని ఆశించిన ఫలితాలు రావచ్చు. అంకితభావం గల అటవీ అధికారుల పద్య వేక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర నిఘాలో రిజర్వ్ అడవులలో పులులసంఖ్య పెరిగి నట్టే, ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే పులి బఫర్ జోన్ దాటి టైగర్ కారిడార్‌లో కూడా సురక్షితంగా బతక గలుగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాలకూ, పౌర సమాజానికి, పత్రికలూ, ప్రసార సాధ నాల సహకారం, వన్య ప్రాణుల సంరక్షణ కోసం చిత్తశుద్ధి తో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థల క్రియాశీలక పాత్రలు తోడైతే ఇది 21వ శతాబ్దపు అతి గొప్ప ‘పెద్దపులి సంరక్షణ’ కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పక తప్పదు.
-డా నీలం సంవత్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: