thunder : పిడుగు పడితే మరణ ఘంటికలే!

Follow Us: Google News Daily Hunt
thunder
thunder
FONT SIZE
GET APP

thunder : ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు ఊహించని రీతిలో పిడుగులు బీభత్సాన్ని సృష్టి స్తున్నాయి. పొలాల్లో కష్టపడుతూ, చెట్ల కింద తలదాచుకున్న రైతులు, కూలీలు పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వందలాది మూగజీవాలు, పాడి పశువులు కూడా అక్కడికక్కడే మృత్యువాతపడుతున్నాయి. విజయనగరం జిల్లాలో చెట్టు కింద నిలబడిన మహిళా కూలీలు, తెలంగాణలో పొలాలకు వెళ్లిన గొర్రెల కాపరులు, కాడెద్దులు ఇలా పిడుగుపాటుకు బలవుతున్న ఘటనలు ప్రకృతి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వర్షాకాలంలో మాత్రమే వినిపించే ఉరుములు, ఇప్పుడు నడివేసవిలోనే పల్లెలపై మృత్యు గంటల్లా మోగు తున్నాయి. నేడు ఆకాశం నల్లబడితేనే ప్రజలు ఉలిక్కిపడు తున్నారు. ఈ పరిస్థితిని కేవలం ప్రకృతి సహజ ప్రక్రియగా భావించి పక్కన పెట్టలేం. ఈ ప్రకృతి హెచ్చరికల వెనుక మానవ తప్పిదాల పాత్ర ఎంత ఉందన్న ప్రశ్నను కూడా సమాజం ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. పిడుగులు ఏర్పడటానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చెరువులు, నదులు, నేలలోని తేమ వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. ఈవేడి గాలి వేగంగా పైకి ఎగసి, ఎత్తులో ఉన్న చల్లనిగాలిని తాకిన ప్పుడు భారీ క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాల లోపల నీటి బిందువులు, మంచు కణాలు బల మైన గాలుల ప్రభావంతో ఒకదానికొకటి ఢీకొంటుంటాయి. దాంతో విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. అది ఒక దశలో ఒక్క సారిగా మేఘాల నుంచి భూమివైపు విడుదలవుతుంది. అదే పిడుగుపాటు. వాతావరణంలో వేడి ఎంత ఎక్కువగా ఉంటే ఈ ప్రక్రియ అంత తీవ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో ప్రభుత్వ గణాం కాలే చెబుతున్నాయి.

Read Also : Telangana Weather Update: మరో రెండు,మూడు రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు!

thunder
thunder

thunder : ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే

జాతీయ నేర గణాంకాల సంస్థ మే 2026లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన మొత్తం మరణాల్లో 35.7 శాతం మరణాలు పిడుగుల వల్లే నమోదయ్యాయి. 2024లో దేశ వ్యాప్తంగా పిడుగుపాటు కారణంగా 2,825 మంది మర ణించారు. ఇది అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే 10.4 శాతం ఎక్కువ. మధ్యప్రదేశ్ (577), బీహార్ (360), ఉత్తర ప్రదేశ్ (275), ఒడిశా (249), ఛత్తీస్గఢ్ (241) రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం సగటున 86 నుంచి 95 మంది, తెలంగాణలో కూడా దాదాపు అదే స్థాయిలో ప్రజలు పిడుగుల బారిన పడుతున్నారు. భూతాపం కారణంగా ప్రతి ఒక డిగ్రీ సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పిడుగుల తీవ్రత 8 నుంచి 10 శాతం వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. ఈ మరణాల్లో90 శాతం కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే కావడం మరింత ఆందోళన కలి గించే విషయం. పిడుగులు పెరగడానికి కేవలం ప్రకృతినే నిందించలేం. దీని వెనుక మనుషుల పాత్ర కూడా స్పష్టం గా కనిపిస్తోంది. అడవులను విచ్చలవిడిగా నరికివేయడం, పట్టణాలు విస్తరించడం వల్ల పచ్చదనం తగ్గి భూమి నేరుగా సూర్యరశ్మిని గ్రహించి మరింత వేడెక్కుతోంది. దాంతో పిడుగులకు కారణమయ్యే మేఘాలు చాలా వేగంగా తయారవు తున్నాయి.

రైతులను కాపాడేందుకు..

ఇదే కాకుండా వాహనాలు, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్య వాయువులు, పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరుగుతు న్నాయి. ఇవి మేఘాల్లో చేరినప్పుడు మంచు కణాల మధ్య ఘర్షణ మరింత పెరుగుతుంది. అంటే మనమే సృష్టిస్తున్న కాలుష్యం మేఘాలను ప్రమాదకర విద్యుత్ కేంద్రాలుగా మార్చేస్తోంది. పర్యావరణాన్ని పాడు చేస్తూ తీసుకునే ప్రతి తప్పు నిర్ణయం ఇప్పుడు పిడుగు రూపంలో మనముందుకు వస్తోంది. పిడుగుల నుంచి ప్రజలను, ముఖ్యంగా రైతులను కాపాడేందుకు మన దేశం ఇప్పుడు అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సును సమర్థంగా ఉపయోగిస్తోంది. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ‘దామిని’ మొబైల్ యాప్ ఫోన్ జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. మనం ఉన్న ప్రాంతానికి 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో వచ్చే 40 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందేమో ముందుగానే హెచ్చరిస్తుంది. అంతేకాకుండా పుణేలోని వాతావరణ పరి శోధన సంస్థ దేశవ్యాప్తంగా వందలాది మెరుపు గుర్తింపు పరికరాలను ఏర్పాటు చేసింది. ఇన్ శాట్ 3డి, ఇన్సాట్ 3 డిఆర్ ఉపగ్రహాలు, విశాఖపట్నం, హైదరాబాద్ లోని డాప్లర్ రాడార్లు మేఘాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నా యి. ఐఐటీ సంస్థలు కూడా పిడుగులను ముందే అంచనా వేసే కొత్త సాఫ్ట్వేర్లను తయారు చేస్తున్నాయి.

thunder
thunder

అవగాహనలేకపోతే ప్రాణనష్టం తగ్గదు

అమెరికా, జపాన్, యూరప్ దేశాలు సాంకేతికత సహాయంతో పిడుగులవల్ల జరిగేనష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. యూరప్లో శాస్త్రవేత్తలు ఆకాశంలోకి శక్తివంతమైన లేజర్ కిరణాల ను పంపి పిడుగులను జనాభా లేని ప్రాంతాల వైపు మళ్లించే పద్ధతులను పరీక్షిస్తున్నారు. జపాన్లో ప్రత్యేక డ్రోన్లద్వారా ఇటువంటి మేఘాల్లోని విద్యుత్ శక్తిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో కూడా రాకెట్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రధాన నగరాల్లో ఈపద్ధతులను ప్రయోగాత్మకంగా ప్రారంభించవచ్చు. అలాగే పల్లెల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల వద్ద స్మార్ట్ సైరన్లు ఏర్పాటు చేసి హెచ్చరిక వ్యవస్థను బలపరచాలి. సాంకేతికత ఎంత ఉన్నాప్రజల్లో అవగాహనలేకపోతే ప్రాణనష్టం తగ్గదు. పిడుగులు ఎక్కువగా ఎత్తైన వస్తువులపైనే పడతాయి. కాబట్టి ఉరుములు వచ్చినప్పుడు చెట్లకింద నిలబడటం చాలాప్రమాదకరం. బయట బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు పిడుగు పడే పరిస్థితిఉంటే నేలపై పూర్తిగా పడుకోకుండా, మోకాళ్లపై వంగి తలను కిందికి పెట్టుకుని కూర్చోవాలి. అలాగే ఉరు ములు వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, టీవీలు, ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర నిలబడటం చేయకూడదు. ఇనుప వస్తువులు, పంపుల దగ్గర కూడా ఉండకూడదు. పిడుగుపాటు అనేది కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నందుకు ప్రకృతి మనకు ఇస్తున్న గట్టి హెచ్చరిక కూడా. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలపరచడం, గ్రామాల్లో ప్రతిఒక్కరికీ అవగా హన కల్పించడం ఎంత అవసరమో భూతాపాన్ని, వాయు కాలుష్యాన్ని తగ్గించడం కూడా అంతే అవసరం. మానవ ప్రాణాలు రక్షణేలక్ష్యంగా పర్యావరణ పరిరక్షణను ఒక సామా జిక ఉద్యమంగా మార్చినప్పుడే ఆకాశం నుంచి వచ్చే ఈ ప్రమాదం నుంచి మన సమాజాన్ని కాపాడుకోగలం.


-డి. చంద్రభాను

Read hindi news : https://hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు